YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

స్వర్ణ గౌరీ వ్రతం

స్వర్ణ గౌరీ వ్రతం

శ్రావణ మాసం వచ్చిందంటేచాలు ... నోములు వ్రతాలతో చాలా వరకూ ఇళ్లన్నీ కళ కళలాడుతూ కనిపిస్తుంటాయి. ఈ మాసంలో వివాహితస్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో 'స్వర్ణ గౌరీ నోము' నోచుకుంటూ వుంటారు.సిరిసంపదలు. ఆయురారోగ్యాలు పొందడానికి గాను, 'శ్రావణ శుక్లతదియ' రోజున ఈ నోమును నోచుకుంటారు. ఉదయాన్నే నిద్రలేచితలస్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. పసుపుకుంకుమలతో అలంకరించిన పీఠంపై గౌరీదేవి చిత్రపటాన్ని వుంచి 16 ముడులుగల తోరం ధరించి షోడశోపచార పూజ చేయాలి. ఆ తరువాతకథ చదువుకుని అక్షింతలు తలపై వేసుకోవాలి. 

ఇక ఈ నోముకి కారణమైన కథ విషయానికి వస్తే, పూర్వం  ఒక రాజువేటకి వెళ్ళిన సందర్భంలో ఓ నదీ తీరాన కొందరు ఏదో పూజచేస్తున్నట్టుగా కనిపించడంతో, విషయమేమిటని వాళ్లని అడుగుతాడు. 'స్వర్ణగౌరీ నోము' నోచుకుంటున్నట్టుగా వాళ్లు చెప్పడంతో, విధి విధానాలుతెలుసుకుని ఇంటికి తిరిగివస్తాడు. ఇద్దరు భార్యలకి ఈ నోము గురించిచెప్పి, ఆచరించ వలసిందిగా కోరతాడు. ఈ విషయాన్ని కొట్టిపారేసిన పెద్దరాణి రాజుకి దూరమవుతుంది. చిన్నరాణికి ఆశించినవి లభిస్తాయి. తన తప్పు తెలుసుకున్న పెద్దరాణిఈ నోమును ఆచరించడంతో తిరిగి రాజు ఆదరణను పొందుతుంది. కథపూర్తి అయిన తరువాత 16 రకాల పండ్లను16 రకాల పిండివంటలను గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించాలి.తమ తాహతుకితగినట్టుగా బ్రాహ్మణులకు దానాలు చెయ్యలి. ఇలా 16 సంవత్సరములు చేశాక పార్వతీ పరమేశ్వరులకు  వస్త్రాలనుసమర్పించి, ఆ రోజున 16 రకాల వంటకాలను. ఫలాలను 16 మందిముత్తైదువులకు మూసివాయనమివ్వాలి. దాంతో ఉద్యాపన కార్యక్రమం పూర్తవుతుంది. 

Related Posts