YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్వతంత్ర అభ్యర్ధిగా రఘురామ

స్వతంత్ర అభ్యర్ధిగా రఘురామ

ఏలూరు, ఆగస్టు 13, 
బయటకు ఎన్ని అనుకున్నా రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు తన రాజకీయ భవిష్యత్తు కోసం కాస్తా గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఒక వేళ అనుకున్న అంచనాలు తప్పి తన మీద అనర్హత వేటు పడితే నర్సాపురానికి ఉప ఎన్నికలు వస్తే ఏం చేయాలి అన్న దాని మీద ఆయనకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఉందని చెబుతున్నారు. ఉప ఎన్నికలు అనివార్యం అయితే రఘురామ కృష్ణ రాజు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు అంటున్నారు. అలాగైతేనే ఆయనకు విపక్ష కూటమి మొత్తం నుంచి మద్దతు దక్కుతుంది అంటున్నారు. దాని కోసం ఆయన పూర్వ రంగాన్ని ఇప్పటికే సిధ్ధం చేసుకుంటున్నారు అన్నది తాజా కబురుగా ఉంది.జగన్ విషయంలో రఘురామ కృష్ణ రాజు తగ్గేది లేదు అంటున్నారు. ఈ విషయంలో తాను ఎందాకైనా అని కూడా అంటున్నారు. ఆయన మీద అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరుతోంది. ఈ రోజుకు కేంద్రం నుంచి మొదటి పరిష్కారం వైసీపీకి ఏంటి అంటే రఘురామ కృష్ణ రాజు ను ఇంటికి పంపించేయడమే అంటారు అంటారు. ఆ తరువాతనే విభజన హామీలు, ప్రత్యేక హోదా అయినా, మరేదైనా అని కూడా చెబుతారు. అంటే ఒక్క రఘురామ కృష్ణ రాజు కోసం మొత్తం పార్టీని, తనను కూడా ఒడ్డి మరీ అవతల వైపున‌ బలంగా నిలబడ్డారు జగన్. అందువల్ల రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కాబట్టి రఘురామ కృష్ణ రాజు మీద వేటు పడినా పడవచ్చు అంటున్నారు. అదే జరిగితే తొడకొట్టి మరీ జగన్ మీద గెలవాలని రాజు గారు ఆశపడుతున్నారు.రఘురామ కృష్ణ రాజు కు టీడీపీ గట్టి మద్దతుదారు అన్న సంగతి తెలిసిందే. ఇక బీజేపీతో ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టే ఇన్నాళ్ళుగా ఆయన మీద వేటు పడడంలేదు అంటారు. అలాగే జనసేనతో కూడా మంచి అనుబంధం ఉంది. అయితే టీడీపీ తరఫున ఆయన నిలబడితే మద్దతుకు బీజేపీ జనసేన ముందుకు రాకపోవచ్చు. దాంతో ఆయన ఇండిపెండెంట్ గానే పోటీ చేయాలనుకుంటున్నారు. అలా విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా ఆయన బరిలో ఉండి జగన్ ఏ అభ్యర్ధిని నిలబెట్టిన ఓడించాలని చూస్తున్నారుట. ఒక విధంగా రఘురామ కృష్ణ రాజు ను ముందు పెట్టి జగన్ ని తొలిసారి ఓడించడానికి విపక్షాలు ముందస్తు అవగాహనతో ఉన్నాయని కూడా చెప్పాలిక్కడ.ఇక రఘురామ కృష్ణ రాజు మీద వేటు అని డిమాండ్ చేస్తూ వస్తున్న వైసీపీకి నర్సాపురంలో సరైన క్యాండిడేట్ ఉన్నారా అన్నదే ప్రశ్న. మాజీ ఎంపీ గంగరాజు ఫ్యామిలీని బీజేపీ నుంచి వైసీపీలోని రప్పించినా వారు ఈ ఉప ఎన్నికల్లో నిలబడతారా అన్నది కూడా చూడాలి. ఇక రఘురామ కృష్ణ రాజు కు మంచికో చెడ్డకో బాగానే పొలిటికల్ ఫోకస్ వచ్చింది. దాంతో ఆయన మీద సరైన వారే బరిలో ఉండాలి. దాంతో కాపులకు టికెట్ ఇస్తారు అన్న ప్రచారం ఉంది. మరి అలా చూసుకుంటే కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి వారున్నారు. మరి ఆయన ఎంతవరకు పోటీ ఇస్తారో కూడా చూడాలి. ఇక వచ్చే ఏడాది ఉప ఎన్నిక జరుగుతుంది అంటున్నారు. అప్పటికి జగన్ సర్కార్ కి మూడేళ్ళ పాలన పూర్తి అవుతుంది. మరి అనాటికి యాంటీ ఇంకెంబెన్సీ ఏర్పడితే వైసీపీకి పొలిటికల్ గా ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. మొత్తానికి జగన్ ని విడిగా ఓడించలేమని భావిస్తున్న విపక్షాలను కలిపే వారధిగా సారధిగా ఈ ఉప ఎన్నికల ద్వారా రఘురామ కృష్ణ రాజు ముందుకు వస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Related Posts