YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పవన్ ఆచితూచి అడుగులు

పవన్ ఆచితూచి అడుగులు

విజయవాడ, ఆగస్టు 13, 
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలకు సమయాత్తమవుతున్నారు. ప్రస్తుతానికి బీజేపీతో కలసి ఉన్నా రానున్న రోజుల్లో సమీకరణాలు మారే అవకాశం ఉంది. అయితే గతంలో ఉన్న క్రేజ్ ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఉందా? అంటే డౌటే అన్న సమాధానం వస్తుంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమి పాలయిన పవన్ కల్యాణ్ ఈసారి ఎక్కడ నుంచి పోటీ చేసినా అంతటి క్రేజ్ రాదన్నది విశ్లేషకుల అంచనా.2014లో పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చారు. బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కల్యాణ్ ప్రభావం కూడా ఈ విజయం వెనక ఉందని అందరూ భావించారు. కానీ 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన పవన్ కల్యాణ్ కు ఎక్కడా విజయం దక్కలేదు. కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కనీసం సొంత సామాజికవర్గం ఓటర్లు కూడా పవన్ కల్యాణ్ కు దన్నుగా నిలవలేదు.జనసేన ఏడేళ్ల క్రితానికి ఇప్పటికీ పెద్దగా బలోపేతం అయింది లేదు. పైగా పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై పోరాడింది లేదు. పార్ట్ టైం పొలిటీషియన్ గానే పవన్ కల్యాణ్ ను ప్రజలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ పవన్ కల్యాణ్ కు ఆయన అభిమానులతో పాటు సొంత సామాజికవర్గం నేతలు అండగా నిలుస్తారన్న గ్యారంటీ లేదు. క్షేత్రస్థాయిలో పవన్ కల్యాణ్ ఇప్పటికీ నాయకత్వాన్ని బలపర్చే ప్రయత్నం చేయడం లేదు.ఇక వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ బీజేపీతో కలసి పోటీ చేస్తే మళ్లీ రిజల్ట్ రిపీట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. కనీస పనితీరును ఏ ఎన్నికల్లోనూ జనసేన కనపర్చకపోవడంతో క్యాడర్ కూడా నిరాశలో ఉంది. తెలుగుదేశం పార్టీతో కలిస్తేనే పవన్ కల్యాణ్ పార్టీకి కొంత భవిష్యత్ ఉందన్న సూచనలు అందుతున్నాయి. మొత్తం మీద గతంలో పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఉండదన్నది వాస్తవం.

Related Posts