YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

పిల్లల్లో పెరుగుతున్న కరోనా కేసులు

పిల్లల్లో పెరుగుతున్న కరోనా కేసులు

ముంబై, ఆగస్టు 13, 
 దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల ఈ మహమ్మారి ఉద్ధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ తాజాగా 41 వేలకు పైగా కొత్త కేసులు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు పెద్దలను తికమక పెట్టిన కరోనా మహమ్మారి.. తాజా పిల్లలపై ప్రతాపం చూపించేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా థర్డ్ వేవ్‌ చిన్న పిల్లలకు ప్రమాదకరమని నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన తరుణంలో.. కర్ణాటక, మిజోరం రాష్ట్రాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయియ. గత కొద్ది రోజులుగా చిన్నపిల్లల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.కోవిడ్ థర్డ్ వేవ్‌.. చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్న అంచనాల నేపథ్యంలో ఈ పరిణామం ఇప్పుడు కలవరపెడుతోంది. అయితే, మరికొద్ది రోజుల్లోనే చిన్నపిల్లల్లో కరోనా కేసులు మూడింతలు పెరిగే ముప్పు ఉందని కర్ణాటక ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే క్రమంలో కర్ణాటక రాజధాని బెంగుళూరులో గడిచిన 5 రోజుల్లో 19 ఏళ్ల లోపు వయస్సు ఉన్న 242 మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు. ఈ వివరాలను బెంగళూరు మహానగర పాలికే వెల్లడించింది. కోవిడ్ బారిన పడ్డ చిన్నారుల్లో తొమ్మిదేళ్ల లోపు వయసున్న వారు 106 మంది ఉన్నారని బీబీఎంపీ తెలిపింది. అలాగే 9- 19 ఏళ్ల వయసున్న పిల్లలు 136 మంది ఉన్నట్లు వెల్లడించింది. జరుగుతున్న పరిణామాలను బట్టి, థర్డ్ వేవ్ ఇప్పటికే మొదలైందని పలువరు నిపుణులు చెబుతున్నారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలని కర్ణాటక ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి సూచించారు. రాబోయే కొద్ది రోజుల్లోనే చిన్న పిల్లల్లో ఈ కేసులు మూడింతలు పెరిగే అవకాశముందని ఆ అధికారి అంచనా వేశారు.మరోవైపు, కర్ణాటకలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించింది. అటు మ‌హారాష్ట్ర, కేరళ‌లో రాష్ట్రాల స‌రిహ‌ద్దు జిల్లాల్లో వారాంత‌పు క‌ర్ఫ్యూ విధించారు. 8 కర్ణాటక సరిహద్దు జిల్లాలు- మైసూర్, చారమాజ్ నగర్, మంగళూరు, కొడగు, బెళగావి, బీదర్, కలబుర్గి, విజయాపుర జిల్లాలో వీకెండ్ కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం బసవరాజ్ బొమ్మై గత వారం తెలిపారు.ఇదిలావుంటే గురువారం మిజోరంలో 576 కొత్త కేసులు నమోదు కాగా.. వీరిలో 128మంది చిన్నారుల్లోనే ఈ వైరస్‌ వెలుగుచూడటం గమనార్హం. మిజోరంలో గడిచిన 24గంటల వ్యవధిలో 6,192 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 576మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కొత్త కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 46,896కి పెరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 9.30శాతంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, కొత్తగా మరో ఇద్దరు కోవిడ్‌తో మృతిచెందడంతో ఆ సంఖ్య 173కి చేరిందని వివరించారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క ఐజ్వాల్‌ జిల్లాలోనే అత్యధికంగా 323 కేసులు వచ్చాయన్నారు. తాజాగా ఈ మహమ్మారి బారిన పడినవారిలో చిన్నారులతో పాటు ఎనిమిది మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూడా ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,989 యాక్టివ్‌ కేసులు ఉండగా.. రికవరీ రేటు 74శాతంగా ఉందని వివరించారు. ఇప్పటివరకూ 6.24లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించగా.. వీరిలో 2.13 లక్షల మందికి రెండు డోసులూ అందినట్టు వెల్లడించారు

Related Posts