YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

క్లౌడ్ ఆధారిత అప్లికేషన్ ఉత్పాదనని సంపాదించుకున్న వాయన నెట్ వర్క్

క్లౌడ్ ఆధారిత అప్లికేషన్ ఉత్పాదనని సంపాదించుకున్న వాయన నెట్ వర్క్

భారతదేశపు అతిపెద్ద థర్డ్-పార్టీ తక్కువ కాలవ్యవధి వ్యాపార ఫైనాన్సింగ్ ప్లాట్ఫారం ఐన వాయన నెట్ వర్క్, సహీజి.ఎస్.టి అనే జి.ఎస్.టి రిటరిన్ ఫైలింగ్ మరియు అనుకూలత కొరకు క్లౌడ్ ఆధారిత అప్లికేషన్ ఉత్పాదనని సంపాదించుకున్నట్లు ప్రకటించింది. ఈ సంపాదన వలన వాయన నెట్ వర్క్ జి.ఎసి.టి లో పోర్ట్ ఫోలియో మరియు ఇ-వే బిల్ స్పేస్ ఆఫరింగులను దృఢపర్చుకొనుటకు కావలసిన సహకారం అందుతుంది. ఈ సంపాదన గురించి మాట్లాడుతూ, అంకుర్ పి అగ్పవాల్, కో-ఫౌండర్, సహీజి.ఎస్.టి ఇలా అన్నారు, “సహీజి.ఎస్.టి నిర్మాణం మరియు భారతీయ వ్యాపార సముదాయానికి సేవలు అందించుట ఒక నమ్మలేని ప్రయాణం. వాయన నెట్ వర్క్ తో చేతులు కలపటం ద్వారా ఇది మరింత ఉన్నత స్తాయికి చేరుకుంటుంది. సహీజి.ఎస్.టి మరియు వాయన కలిసి నేడు అత్యుత్తమ జి.ఎస్.టి ఫైలింగ్ పరిష్కారాలు అందిస్తుందని నేను విశ్వసిస్తున్నానన్నారు.. “వాయన నెట్ వర్క్ ఇండియాలో మన ప్రభుత్వం ద్వారా ఆమోదం పొందిన జి.ఎస్.టి. సువిధా ప్రొవైడర్స్ లో ఒకటిగా సగర్వంగా నిలిచిందని, మేము వ్యాపారంలో జి.ఎస్.టి. అనుకూలత కొరకు మేము నేక ఎ.ఎస్.పిలతో భాగస్వామ్యం కలిగి ఉన్నామని తెలిపారు. సహీ జి.ఎస్.టి. వ్యాపార పోర్ట్ ఫోలియో మరియు దాని దూరదృష్టి మాకు సరియైన మ్యాచ్. ఈ సముపార్జన ద్వారా, మేము మా ప్రస్తు ఖాతాదారులకు మరింత చేరువగా వేళ్లి, జి.ఎస్.టి. 

ఇ-వే బిల్ అనుకూలత విషయంలో మరియు షార్ట్ టర్మ్ ట్రేడ్ ఫైనాన్సింగ్ లో అత్యుత్తమ పరిష్కారాలు అందించాలని మేము ఆశిస్తున్నాము.” అని ఆర్.ఎన్. అయ్యర్, వాయనా నెట్ వర్క్ ఫౌండర్ మరియు సిఇఓ అభిప్రాయం వ్యక్తం చేసారు. సహీజి.ఎస్.టి అనేది భారతదేశంలో ఛార్టర్డ్ అకౌంటెంట్లు (సిఏలు), కార్పొరేట్లు మరియు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ ద్వారా విస్తృతంగా ఉపయోగించబడుతున్న సాఫ్ట్ వేర్. సహీజి.ఎస్.టి ని వాయన పోర్ట్ ఫోలియో క్రిందకు తీసుకు రావటం ద్వారా, ప్రస్తుతం ఉన్న ఉత్పాదన ఫీచర్లు మరియు లైసెన్సుని అలాగే ఉంచుతూ తమ ఖాతాదారులకు సేవలు అందించుటలో సౌకర్యం మరింతగా పెరుగుతుంది. సహీజి.ఎస్.టి అనేది వాయన నెట్ వర్క్ లో ఒక పోర్ట్ ఫోలియో ఉత్పాదనగా భావించబడుతుంది మరియు ప్రస్తుతం ఉన్న క్లైంట్స్ కి వాయన జి.ఎస్.పి. సపోర్ట్ తో ఎలాంటి ఇబ్బంది లేని ఉత్తమమైన సేవలు అందించ బడతాయి.సహీజి.ఎస్.టి ని 2016 ఉత్తరార్థంలో దినేష్ తేజ్వాని, అంకుర్ అగ్రవాల్, ధృవ్ పటేల్,  తీర్థేష్ గణత్రా మరియు కెయూర్ షా ద్వారా కనిపెట్టబడినది. సహీజి.ఎస్.టి అనేది, తమ ఖాతాదారులు ఎపిఐలు ద్వారా జి.ఎస్.టి.ఎన్, కి జి.ఎస్.టి. రిటర్నులు సమర్పించుటకు సహకరించే భరతదేశంలోని మొట్టమొదటి ఎ.ఎస్.పి. కో-ఫౌండర్ తీర్థేష్ గణత్రా, ఈ సంపాదన సమాచారాన్ని లాయనా సమర్పించుటలో దానితో చేతులు కలిపారు.ఈ సముపార్జన ద్వారా వాయన నెట్ వర్క్ కి,  సహీ జి.ఎస్.టి.  మరియు ఇ-వే బిల్ అనుకూలత చేర్చుకొనుట ద్వారా రేఖాంకిత వ్యాపార ఐక్యత సాధ్యమవుతుంది. వాయన నెట్ వర్క్  ఇప్పుడు 500 కి పైగా పెద్ద కార్పొరేట్స్ మరియు ఎఫ్.ఐ.లు తమ అధీకృత జి.ఎస్.టి సేవలు అందిస్తూ ఉన్న జి.ఎస్.పి. మరియు ఇది ఇతర ఎ.ఎస్.పి లతో సంబంధం కలిగి 150,000 ఎస్.ఎమ్.ఇలు తమ ఎ.పి.ఐ. ట్రాఫిక్ ని ఈ కంపెనీ ద్వారా రూటింగ్ చేస్తున్నవి. వాయన జి.ఎస్.పి ద్వారా జి.స్.టి.ఎన్. కి నిరంతరాయమైన తమ అత్యున్నత మరియు గణనీయమైన సెక్యూర్ జి.ఎస్.పి సేవలను సునిశ్చితం చేస్తున్నది.

Related Posts