YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో దుమారం రేపుతున్న నకిలీ చలనాల స్కాం 10 మంది ఉద్యోగుల సస్పెండ్... 20కు పైగా కేసులు నమోదు

ఏపీలో దుమారం రేపుతున్న నకిలీ చలనాల స్కాం 10 మంది ఉద్యోగుల సస్పెండ్... 20కు పైగా కేసులు నమోదు

ఏపీలో దుమారం రేపుతున్న నకిలీ చలనాల స్కాం
10 మంది ఉద్యోగుల సస్పెండ్... 20కు పైగా కేసులు నమోదు
విజయవాడ, ఆగస్టు 13
ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అసలేం జరుగుతోంది? కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది ఎవరు? ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతోన్న అవినీతి వెనుక సూత్రధారులెవరు? పాత్రధారులెవరు? ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీ స్కామ్ బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఇది బయటపడింది. సాఫ్ట్ వేర్ లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న కేటుగాళ్లు ప్రభుత్వ ఆదాయానికి పెద్దఎత్తున గండికొడుతున్నారు.ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. నకిలీ చలానాలతో కోట్లు కొట్టేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఈ ఫేక్ చలానాల భాగోతం బయటపడటంతో రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఉన్నతాధికారులు దాడులు నిర్వహించారు. సీఎఫ్ఎంఎస్లోని లోపాలే ఆసరాగా కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తించారు.సాఫ్ట్ వేర్ లో సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకుంటోన్న కేటుగాళ్లు ఈ-చలానాలను దారి మళ్లిస్తున్నారు. సీఎఫ్ఎంఎస్ , ఈ-చలానా, ఈసీ, ఆర్హెచ్, నకళ్లును సీనియర్ అసిస్టెంట్లు చేయాల్సి ఉండగా… ఈ పనులను ప్రైవేట్ రైటర్స్‌తో చేయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ దందా వెనుక సబ్ రిజిస్ట్రార్లే సూత్రధారులుగా ఉన్నారే ఆరోపణలు వస్తున్నాయి. డాక్యుమెంట్ రైటర్లు కేవలం పాత్రధారులేనన్న మాట వినిపిస్తోంది.కడప జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ బోగస్ చలానాల మోసం బయటపడింది. దాంతో, ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు, ఇద్దరు క్లర్క్ లపైనా వేటు పడింది. ఫేక్ చలానాలతో కోటీ రూపాయలకు పైగా స్వాహా చేసినట్లు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేశారు. కడప అర్బన్ సబ్ రిజిస్ట్రార్లు చంద్రమోహన్, సుబ్బారెడ్డి, అసిస్టెంట్ రత్నమ్మ… అలాగే కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ హరికృష్ణ, అసిస్టెంట్ సుకుమార్ ను విధుల నుంచి తప్పించారు.కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. సబ్ రిజిస్ట్రార్ సోఫియా బేగం, జూనియర్ అసిస్టెంట్ వీరన్నను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నకిలీ చలానాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు తేలడంతో విధుల నుంచి తొలగించారు. బోగస్ చలానాలతో అక్రమాలకు పాల్పడిన ఆరుగురు స్టాంప్ రైటర్లపై కేసు నమోదు చేశారు.విజయనగరం జిల్లాలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు బయటపడ్డాయి. గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో బోగస్ చలానాలతో కోట్లు కొట్టేసినట్లు తనిఖీల్లో తేలింది. పెద్దమొత్తంలో డబ్బు పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. డాక్యుమెంట్ రైటర్సే కీలక సూత్రధారులుగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఉన్నతాధికారుల దాడులతో పలుచోట్ల సబ్ రిజిస్ట్రార్లు ముందే జాగ్రత్త పడుతున్నారు. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ రాధాకృష్ణ తెలివిగా డాక్యుమెంట్ రైటర్స్ పై రివర్స్ లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఈ-చలానాలతో అక్రమాలకు పాల్పడ్డారంటూ ముగ్గురిపై కంప్లైంట్ ఇచ్చారు.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీగ లాగేకొద్దీ డొంక కదులుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ అవినీతి అక్రమాలు పెద్దఎత్తున బయటపడుతున్నాయి. పాత్రధారులుగా డాక్యుమెంట్ రైటర్స్ కనిపిస్తున్నా… సూత్రధారులు మాత్రం సబ్ రిజిస్ట్రార్స్, అధికారులేనన్న మాట వినిపిస్తోంది.
సీఎం సీరియస్
రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వానికి చెల్లించే ఫీజు విషయంలో జరిగిన బోగస్ చలనాల కుంభకోణంపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇవాళ అమరావతిలోని క్యాంప్ ఆఫీస్‌లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై ఫోకస్ పెట్టాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు.ఇప్పటికే రూ. 40 లక్షల మేర సొమ్మును రికవరీ చేసినట్టు అధికారులు సీఎం‌కు వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ లో మార్పులు చేసినట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్‌వేర్‌ను ఎన్ఐసీ, సీఎఫ్ఎంఎస్‌లకు అనుసంధానం చేసినట్టు చెప్పారు. అనుసంధానం ద్వారా అవకతవకలకు చెక్ పెట్టవచ్చని సీఎంకు అధికారులు వివరించారు. ఇక, బోగస్ ఛలాన్లకు సంబంధించి మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలని సీఎం జగన్ ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.కాగా, నకిలీ చలానాల దందా గుంటూరు జిల్లాలోనూ బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్‌లు చేయించుకొని.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లుగా తెలుసుకున్న అధికారులు తనిఖీలు చేపట్టారు. మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్ పరిధిలో 8 డాక్యుమెంట్స్‌లో నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. సీఎఫ్‌ఎంఎస్‌లోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకొని.. ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా తేల్చారు అధికారులు.ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు సుమారు రూ.8 లక్షలు రికవరీ చేసుకున్నారు అధికారులు. సబ్‌ రిజిస్ట్రార్ రాధాకృష్ణ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కొంతమంది డాక్యుమెంట్ రైటర్లని విచారిస్తున్నారు. డాక్యుమెంట్ల ప్రకారం 2లక్షల 15వేలు చెల్లించాల్సి ఉండగా.. సీఎఫ్‌ఎంఎస్‌లో 15 వేలు చలానా తీసి.. దాని ప్రింట్‌ అవుట్‌లో ముందు రెండు అక్షరం యాడ్ చేసినట్లుగా గుర్తించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు మోసానికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు పోలీసులు.

Related Posts