YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విదేశీయం

తాలిబన్ల వశమవుతున్న ఆఫ్గన్

తాలిబన్ల వశమవుతున్న ఆఫ్గన్

తాలిబన్ల వశమవుతున్న ఆఫ్గన్
న్యూఢిల్లీ, ఆగస్టు 13
ఆఫ్గనిస్థాన్‌లోని ప్రధాన నగరాలను, ప్రాంతాలను తాలిబన్లు ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటున్నారు. దాదాపు 70 శాతం భూభాగం వారి అధీనంలోకి వెళ్లినట్టు నివేదికలు పేర్కొంటున్నాయి. రెండు దశాబ్దాల కిందట తమ వికృత పాలనతో అఫ్గన్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన తాలిబన్లు.. మళ్లీ పెచ్చుమీరుతున్నాయి. ముఖ్యంగా మహిళల పట్ల తాలిబన్ మూకల అకృత్యాలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇళ్ల నుంచి బయటకు రావడానికే మహిళలు భయపడిపోయే పరిస్థితి నెలకుంది.ఇదిలా ఉండగా, తమ ఉగ్రవాదులను పెళ్లిచేసుకోవాలని మహిళలను తాలిబన్లు బలవంతం చేస్తున్నట్టు అంతర్జాతీయ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది. అఫ్గన్ సైన్యంపై దాడులకు తెగబడి.. నరమేధానికి పాల్పడుతున్నారు. తాము ఆక్రమించుకున్న ప్రాంతాల్లో సైనికులను దారుణంగా హత్య చేస్తున్నారు. వారి ఆగడాలకు తట్టుకోలేక చాలా మంది ప్రాణభయంతో రాజధాని కాబూల్ నగరానికి పరుగులు పెడుతున్నారు.అవివాహిత యువతులను తాలిబన్ ఉగ్రవాదులు బలవంతంగా పెళ్లిచేసుకుని, లైంగికంగా హింసిస్తున్నారని మానవహక్కుల సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. తాము విజయం సాధించామని బహిరంగంగా ప్రతిజ్ఞ చేసిన తాలిబన్లు.. తమ పాలనలో అఫ్గన్ ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, సైన్యాలకు ఎటువంటి భయాందోళనలు అవసరంలేదని ప్రకటిస్తున్నారు. కానీ, వారి చర్యలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి’ అని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.తమ చేతికి చిక్కిన అఫ్గన్ సైనికులను దారుణంగా హింసించి చంపుతున్నారనే నివేదికలపై కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ‘ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం.. యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారు’ అని ట్విట్టర్‌లో మండిపడింది. మరోవైపు, రాజధాని నగరం కాబూల్ దిశగా తాలిబన్లు మరో అడుగు ముందుకేశారు.అఫ్గన్‌లో రెండో అతిపెద్ద నగరమైన కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు గురువారం రాత్రి ప్రకటించారు. కాబూల్‌లోని గవర్నర్ కార్యాలయం, ఇతర పరిపాలనా భవనాలను ఆక్రమించుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ మొత్తం 12 ప్రావిన్సుల రాజధానులు తాలిబన్ల వశమయ్యాయి.
బాలికల కోసంబరితెగింపులు
ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ల హింస రోజురోజుకు తీవ్రస్థాయికి చేరుతోంది. అఫ్ఘాన్‌ భూభాగాల నుంచి అమెరికా సైన్యం వైదొలిగిన అనంతరం తాలిబాన్లు ఇప్పటికే పలు కీలక భూభాగాలను ఆక్రమించారు. ఈ క్రమంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ వైపు ఆఫ్ఘాన్ సైన్యంపై తాలిబాన్ ఉగ్రవాదులు దాడి కొనసాగిస్తునే.. మరోవైపు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదులు ఇప్పుడు 12 ఏళ్లలోపు బాలికలను బలవంతంగా పెళ్లి చేసుకుని.. వారిని లైంగిక బానిసత్వంలోకి నెట్టడానికి ఇంటింటికీ తిరుగుతున్నారు.అంతర్జాతీయ మీడియా వెల్లడించిన ప్రకారం.. తాలిబాన్ ఉగ్రవాదులు ఇప్పటికే కొన్ని ప్రావిన్షియల్ రాజధానులను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో తాలిబాన్లను వివాహం చేసుకోవడానికి 12 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల అవివాహిత మహిళల జాబితాలను తీసుకురావాలని స్థానిక ఇమామ్‌లను ఆదేశించారు. దీంతోపాటు.. వయసుకనుగుణంగా.. తాలిబాన్లు మహిళలను విభజించుకోవాలని ప్రాణాళికలు చేసుకుంటున్నారు. తాలిబాన్ కమాండర్ల ఆదేశాల మేరకు.. తీవ్రవాదులు ఇంటింటికి వెళుతూ.. బాలికల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇళ్లల్లోకి సైతం ప్రవేశిస్తున్నారని అంతర్జాతీయ మీడియా తెలిపింది.కాగా.. తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో కఠినమైన షరియా చట్టాలను అమలు చేస్తున్నారు. కమాండర్ల అనుమతి లేకుండా మహిళలు పాఠశాలలకు వెళ్లడం కానీ.. పని చేయడం కానీ, ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం లాంటి వాటిని నిషేధించారు. దీంతోపాటు ఆప్ఘాన్ ప్రజలు తమ పిల్లలను తాలిబాన్లకు ఇచ్చి పెళ్లి చేయాలని హుకూం జారీ చేశారు. దీంతో ఆ దేశంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబాన్ల పాలన మొదలైతే ఇంకా ఎన్ని అరాచకాలు మొదలవుతాయో అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆప్ఘాన్ రాజధాని కాబూల్‌ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్నీ పట్టణాన్ని కూడా వశపరుచుకున్న తాలిబన్లు.. శుక్రవారం కందహార్ పట్టణాన్ని సైతం పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆఫ్ఘానిస్థాన్‌లోని 34 ప్రొవిన్షియల్ రాజధానులల్లో 12 కీలక ప్రాంతాలను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు
 

Related Posts