సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్
15 నుంచి ఇంటర్ పరీక్షలు
హైదరాబాద్, ఆగస్టు 13,
లంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో విద్యా సంస్థలు తెరవడానికి వైద్య ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సెప్టెంబరు 1 నుంచి పాఠశాలలు, కాలేజీలను తెరవాలని విద్యాశాఖ భావిస్తోంది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మొదటి దశలో 8, 9, 10 తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ, ఇతర కళాశాలల్లోకి విద్యార్థులను అనుమతించాలని యోచిస్తున్నారు. తర్వాత కిందిస్థాయి తరగతులను ప్రారంభించాలన్నది ప్రణాళిక.ఆగస్టు తొలివారంలోనే పలు రాష్ట్రాలు ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాయి.. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ సహా మరికొన్ని త్వరలో విద్యా సంస్థలను తెరవడానికి ముహూర్తం ఖరారు చేశాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, యూనిసెఫ్, పార్లమెంట్ స్థాయీ సంఘం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ తదితర విభాగాలు సైతం విద్యాసంస్థలను తెరవాలని సూచించాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కూడా పాఠశాలలు తెరచుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది.ఈ క్రమంలో సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష బోధన మొదలుపెట్టాలని విద్యాశాఖ ఆలోచిస్తోంది. ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలను (ప్రస్తుతం ద్వితీయ ఇంటర్) 15 రోజులు గడువు ఇచ్చి జరపాలని భావిస్తోంది. ప్రత్యక్ష తరగతులపై త్వరలోనే సీఎం కేసీఆర్‌తో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చించనున్నారు. ఈ వారంలోనే ప్రభుత్వం అధికారికంగా తేదీని ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నారు