YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కమలానికి పూర్వ వైభవం కోసం కష్టాలు

కమలానికి పూర్వ వైభవం కోసం కష్టాలు

విజయవాడ, ఆగస్టు 14, 
భారతీయ జనతా పార్టీ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు ఏ పార్టీతో పొత్తు లేకుండా గెలుచుకున్న రోజులవి. 1998 లో దేశవ్యాప్తంగా వీచిన అటల్ బిహారీ వాజ్ పేయి గాలి లో తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, కరీంనగర్, సికింద్రాబాద్ లోక్ సభ స్థానాల్లో జయకేతనం ఎగురవేసి రాజకీయ విశ్లేషకులకు సైతం షాక్ ఇచ్చేసింది కమలం. రాజమండ్రి నుంచి గిరజాల వెంకటస్వామి నాయుడు, కాకినాడ నుంచి సినీ నటుడు కృష్ణం రాజు, సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ, కరీంనగర్ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు లు నాడు విజేతలు అయి దేశవ్యాప్త చర్చలో చరిత్రకెక్కిన వారు. దాంతో వాజ్ పేయి ప్రభంజనం ముందే గ్రహించిన చాణుక్యుడు చంద్రబాబు బీజేపీ తో దోస్తీ కట్టి ఆ పార్టీ జోరుకు బ్రేక్ లు వేసేసారు. నాడు ఉమ్మడి ఎపి లో రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, సికింద్రాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ లు గెలుచుకుంది బిజెపి.కట్ చేస్తే ఆ తరువాత 2004 లో మోడీ గోద్రా అల్లర్ల కారణంగా బీజేపీ తో పొత్తు ఉంటే తమపార్టీ కి మైనారిటీ ఓటు బ్యాంక్ దూరం అవుతుందన్న అంచనా తో టిడిపి అధినేత వారితో జట్టు పీస్ కొట్టేశారు. తిరిగి 2014 లో మోడీ ప్రభంజనం గతంలో లాగే అంచనా వేసిన చంద్రబాబు మళ్ళీ అద్భుతమైన వ్యూహంతో కమలంతో బాటు జనసేన తో పొత్తు కలిపి అధికారం అందుకున్నారు. అయితే ఈ పొత్తులో విశాఖ లో కంభంపాటి హరిబాబు, నర్సాపురం నుంచి గోకవరపు గంగరాజు, సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ మాత్రమే గెలిచారు. టిడిపి పొత్తులో బీజేపీకి ఇచ్చిన సీట్లలో చాలాచోట్ల ఓట్ల బదిలీ సైకిల్ పార్టీనుంచి లేకుండా ఆ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో పాతుకుపోకుండా వ్యూహాత్మకంగా సీట్లను తగ్గించే వ్యూహం విజయవంతంగా అమలు చేసింది. ఇందులో పురంధరేశ్వరి వంటివారు రాజంపేట లో ఓటమి చెందడానికి టిడిపి అమలు చేసిన వ్యూహమే కారణమన్నది నాడు పెద్ద ఎత్తునే చర్చ సాగింది.ఇదిలా ఉంటే 2019 లో మోడీ వేవ్ ను తక్కువ అంచనా వేసి ప్రత్యేక హోదా సెంటిమెంట్ పేరుతో బీజేపీ పై వ్యతిరేకత ప్రజల్లో ఉందన్న తప్పుడు లెక్కలతో చంద్రబాబు బొక్కబోర్లా పడిపోయారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసి మరీ మోడీ పై ధర్మ పోరాటం పేరుతో ఆయన ఇమేజ్ ను ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేశారు చంద్రబాబు. ఆయన వేసుకున్న సెల్ఫ్ గోల్ తో ఎవరినైతే తాను అధికారంలోకి రాకుండా ఉండాలని కోరుకున్నారో వైఎస్ తనయుడు అఖండ మెజారిటీ తో ముఖ్యమంత్రి అయ్యేందుకు 22 ఎంపి సీట్లతో సహా ఇచ్చుకునే పరిస్థితి కొనితెచ్చు కున్నారు. ఇలాంటి దశలో మరోసారి బీజేపీ తో పొత్తు లేకపోతే జగన్ సంక్షేమ పథకాల ఫ్యాన్ గాలిలో కొట్టుకుపోతారేమోననే భయంతో ఆందోళన చెందుతున్నారు.ఈ లెక్కలన్ని సరిచూసుకుని చంద్రబాబు 2024 ఎన్నికల వరకు ఆగే పరిస్థితి లేకుండా ముందుకు వచ్చేశారు. సాక్షాత్తు మహానాడు లో బీజేపీకి తమ మద్దతంటూ స్నేహ హస్తం చాచేయడం గమనిస్తే చంద్రబాబు అభద్రతా భావం ప్రస్ఫుటం అయిపోతుంది. అయితే గత అనుభవాల రీత్యా టిడిపి తో పొత్తు భవిష్యత్తులో సొంత కాళ్లపై నిలబడాలనుకుంటున్న ప్రతీసారి వెనక్కి లాగుతుందన్న అంచనా ఉండటంతో కమలం అధికార వైసిపి, విపక్ష టిడిపి లకు సమాన దూరం అనే సిద్ధాంతం తో వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తుంది. అయితే గతంలో ఏ పార్టీతో పొత్తు లేకుండా నాలుగు ఎంపి స్థానాలు మరోసారి టిడిపి తో పొత్తుతో ఏడు పార్లమెంట్ సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మెరుగైన పరిస్థితి ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్ లో సాధిస్తుందా అన్నది ప్రశ్నర్ధకం గా మిగిలింది.తెలంగాణ లో గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలవడంతో ఇక ఆ రాష్ట్రం పైనే తన ఫోకస్ పెంచింది కమలం. ఇక ఎపి లో గతంలో పొత్తులు లేకుండా, పొత్తులతో గెలిచిన పార్లమెంట్ స్థానాలను తిరిగి గెలిచేందుకు సీరియస్ గా ప్రయత్నం చేస్తుందా లేదా ? అదీ జనసేన వంటి తనకన్నా ప్రస్తుతం మెరుగైన ఓటు బ్యాంక్ కలిగిన వారితో ఉండి కూడా లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎలాంటి ఎత్తులతో ముందుకు సాగుతుందో చూడాలి. అయితే స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోర్ట్ లు వంటి అంశాల్లో కేంద్రం అనుసరిస్తున్న వైఖరే ఏపీ బీజేపీ ఎదుగుదలకు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న మిగిలిన వారికి ఫలితం లేకుండా పోతుందన్న ఆందోళన ఎపి లో ఆ రెండు పార్టీల్లో ఉంది. ఇలాంటి నేపథ్యంలో కూడా గతిలేని పరిస్థితుల్లో బీజేపీ తో దోస్తీకి టిడిపి సిద్ధం కావడం మరింత చర్చనీయం గా మారిపోయింది. రాజకీయ సమీకరణాలు కొన్ని అనుకులిస్తున్నా కమలం రాబోయే రోజుల్లో పుంజుకోవడం ఆషామాషీ కాదు. తెలంగాణ బీజేపీకి కేంద్రం లోని అధిష్టానం సహకరిస్తున్న రీతిలో ఎపి లో సాయం అందించకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుందా అనే ప్రశ్నకు కాలమే ఆ పార్టీ భవిష్యత్తు వచ్చే ఎన్నికల్లో

Related Posts