YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సొంత జిల్లాల్లో బాగుపడేది ఎప్పుడు

సొంత జిల్లాల్లో  బాగుపడేది ఎప్పుడు

తిరుపతి, ఆగస్టు 14, 
చిత్తూరు జిల్లా..టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా అనే విషయం తెలిసిందే. పేరుకే చంద్రబాబుకు సొంత జిల్లా గానీ, ఇక్కడ ఆధిక్యం వైసీపీదే. గత రెండు ఎన్నికలుగా ఈ జిల్లాలో వైసీపీ హవా నడుస్తోంది. ఆ మాట‌కు వ‌స్తే 1999 ఎన్నిక‌ల త‌ర్వాత ఇక్క‌డ ఎప్పుడూ టీడీపీకి మెజార్టీ రాలేదు. ముఖ్యంగా చంద్రబాబు నియోజకవర్గం కుప్పం ఉన్న చిత్తూరు పార్లమెంట్‌లో వైసీపీ డామినేషన్ నడుస్తోంది. గత ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలిచింది ఒక కుప్పంలోనే. అది కూడా చంద్రబాబు సొంత సీటు.. పైగా ఆయ‌న మెజార్టీ చాలా ప‌డిపోయింది. చంద్రగిరి, నగరి, గంగాధరనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు స్థానాల్లో టీడీపీ ఓడిపోయింది. సరే ఎన్నికలై రెండేళ్ళు దాటేసింది. మరి ఈ రెండేళ్ల కాలంలోనైనా ఈ అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పుంజుకుందా? అంటే అసలు లేదనే చెప్పొచ్చు.కుప్పంలో సైతం పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. కాకపోతే చంద్రబాబు ఉన్నారు కాబట్టి అక్కడ టీడీపీకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇక చంద్రగిరిలో పులివర్తి నాని ఉన్నారు. ఈయన పార్టీ తరుపున బాగానే కష్టపడుతున్నారుగానీ, అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హవా మాత్రం తగ్గించలేకపోతున్నారు. చెవిరెడ్డి రెండు సార్లు వ‌రుస విజ‌యాల‌తో జోరు మీదే ఉన్నారు. నగరిలో టీడీపీ పుంజుకోవడానికి మంచి అవకాశం ఉంది. కానీ టీడీపీ నేత గాలి భాను ప్రకాశ్ దూకుడుగా పనిచేయడం లేదు. అందుకే అక్కడ రోజా హవానే కనిపిస్తోంది. అయితే ఇక్కడ వైసీపీ కేడ‌ర్‌లో నైరాశ్యం ఉండ‌గా టీడీపీ కేడ‌ర్ మాత్రం మాంచి క‌సితో ఉంది.గంగాధర నెల్లూరులో టీడీపీ తరుపున హరికృష్ణ యాక్టివ్‌గా పనిచేయడం లేదు. పూతలపట్టులో అసలు టీడీపీ ఉందా అనే పరిస్థితికి వచ్చేసింది. పలమనేరులో మాత్రం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పార్టీ తరుపున గట్టిగానే కష్టపడుతున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో టీడీపీ నాయకుడు యాక్టివ్‌గా పనిచేస్తున్న నియోజకవర్గం ఇదే. అయితే ఆయ‌న కూడా పార్టీ పుంజుకుంటుందా ? లేదా ? అన్న డౌట్‌లో ఉన్నార‌ని పార్టీ నేత‌లే అంటున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అమ‌ర్నాథ్ రెడ్డి గ‌ట్టిగా క‌ష్టప‌డితే ఇక్కడ పార్టీ ఇప్పుడే ట్రాక్ ఎక్కేస్తుంది. అయితే ఆయ‌న ఎక్కువుగా బెంగ‌ళూరు వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు.ఇక కీలకమైన చిత్తూరు అసెంబ్లీలో కూడా టీడీపీకి నాయకుడు లేరు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఏ‌ఎస్ మనోహర్ పార్టీని వీడారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో డీకే ఫ్యామిలీ సైడ్ అయిపోవ‌డం పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే. అటు చిత్తూరు పార్లమెంట్‌ పరిధిలో టీడీపీకి నాయకుడు లేరు. శివప్రసాద్ చనిపోయాక పార్లమెంట్‌కు ఇన్‌చార్జ్‌ని పెట్టలేదు. మొత్తానికైతే సొంత పార్లమెంట్‌లోనే చంద్రబాబు సైకిల్‌ని నిలబెట్టలేకపోతున్నారు

Related Posts