YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం : చంద్రబాబు

తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం : చంద్రబాబు

తెలుగుదేశంను తెలంగాణలో సంపూర్ణంగా బలోపేతం చేసేందుకు పూర్తి సహకారం, ప్రోత్సాహం అందిస్తానని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు మహానాడు నిర్వహణ, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. భవిష్యత్‌ ప్రణాళికలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 24న హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ మైదానంలో మహానాడు నిర్వహించ బోతున్నామని, 27 నుంచి 29 వరకు జాతీయ స్థాయి మహానాడు విజయవాడలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు సూచించారని రావుల తెలిపారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌పై ఎలాంటి చర్చ జరగలేదన్నారు.తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తీరుపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. దూకుడుగా వ్యవహరించాలని, అమాయకంగా ఉంటే పార్టీ మనుగడ కష్టతరంగా మారుతుందని క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అందరినీ కలుపుకుని పోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. మెతక వైఖరిని వీడాలని, కఠినంగా ఉండాలని తెలిపారు. జాతీయ మహానాడు తర్వాత తెలంగాణలో పర్యటిస్తానని... 2019 ఎన్నికల్లో టికెట్లు ఎవరికి ఇవ్వాలో జాబితా సిద్ధంగా ఉందని... ప్రతిభ ఉన్నవారికి ముందుగానే టికెట్లు కేటాయిస్తానని చెప్పారు. మనం బలంగా ఉంటేనే ఇతర పార్టీలు పొత్తు కోసం ముందుకు వస్తాయని అన్నారు.

Related Posts