తిరుమల
కులమత వ్యత్యాసాలకు తావు లేకుండా, పార్టిల విద్వేషాలు లేకుండా పేదలకజ సీఎం జగన్ సంక్షేమ పధకాలు అందిస్తున్నారని ఏపి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు..అనంతరం ఆలయ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ..శిధిలావస్థలో ఉన్న హిందూ దేవాలయాలను సీఎం జగన్ పునర్నిస్తున్నారని, పేదవాడు ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలని,విద్యావంతులు కావాలన్నదే సీఎం ఆకాంక్షిస్తున్నారన్నారు..చంద్రబాబు హయాంలో ఎన్ని దేవాలయాలు పునరుద్దరించారో లెక్క చెప్పాలని ఆయన ప్రశ్నించారు..చంద్రబాబు నాయుడు వైపు ఉన్న వారు కొందరు ఒకే మతానికి సీఎం జగన్ ను ఆపాదించడం చాలా తప్పుని అన్నారు..జీడీ నెల్లూరు నియోజకవర్గంలో నీటి కరువు తాండ విస్తుందని, ఎన్టీఆర్ జలాశయం నుంచి నీటిని మా నియోజకవర్గానికి వచ్చేలా చేయాలనీ సీఎం జగన్ ను విజ్ఞప్తి చేసాంమన్నారు..ఆయనకు ఓటు వేయని వారికి కూడా ప్రభుత్వ పధకాలు అందేలా సీఎం జగన్ చూస్తున్నారని,బిజెపి,టీడీపీ పని గట్టుకొని సీఎం జగన్ పై ఆరోపణలు చేయడం తగదన్నారు..పెదాలపై ప్రేమ..ఆప్యాయత... అనురాగాలు లేని వ్యక్తి చంద్రబాబు అని,ఒక్క పేద కుటుంబానికైనా ఇంటి స్థలాన్ని చంద్రబాబు ఇచ్చాడా అని ఆయన ప్రశ్నించారు.