శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం బందరువానిపేట గ్రామంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లి ముగ్గురు వాడ మత్స్యకారులు మృత్యువాత పడ్డారు. ఎలా జరిగిందో ఘటన చోటుచేసుకుంది అన్న అంశంపై అటు రెవెన్యూ, మత్యశాఖ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు స్పందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకు తెలియజేసి ఆయా కుటుంబాల వారికి వైయస్సార్ బీమా పథకం అందే టట్లుగా చేయాలని మత్స్యకారుల సాగర్ సంఘం డిమాండ్ చేస్తున్నారు. వీరు వేటకు గత 2 రోజుల క్రితం వెళ్లారని తెల్లవారు జామున మృతదేహాలు రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.