YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈ నెల 19 న కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర

ఈ నెల 19 న కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర

హైదరాబాద్
తెలంగాణలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ఖరారయింది. ఆగస్టు 19 నుండి 21 వరకు  కోదాడ నుండి హైదరాబాద్ వరకు యాత్ర కొనసాగనుంది. ఆగస్టు 19 సాయంత్రం నాలుగు గంటలకు కోదాడ లో జన ఆశీర్వాద యాత్ర ప్రారంభం అవుతుంది. ఆ రోజు  సూర్యాపేటలో రాత్రి బస వుంటుంది.  20వ తేదీన దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట, వరంగల్ లో యాత్రా వుంటుంది.  భద్రకాళి మాత దర్శనం తరువాత  వరంగల్, హనుమకొండ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు అయన  శ్రద్ధాంజలి ఘటించనున్నారు.  ఖిల్లాషాపూర్  లో సర్వాయి పాపన్న గ్రామం నుండి జనగామ, ఆలేరు, యాదగిరిగుట్ట లో పర్యటిస్తారు.  వరంగల్ లో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించనున్నారు.  ఆలేరులో పద్మశ్రీ అవార్డు అందుకున్న చేనేత కళాకారులు( కార్మికులు) చింతకింది మల్లేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో దర్శనం చేసుకున్న అనంతరం యాదగిరిగుట్టలో రాత్రి బస చేస్తారు. 21న ఉదయం భువనగిరిలో రేషన్ షాప్ సందర్శించనున్నారు.  ఘట్కేసర్, ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మీదుగా నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయం చేరుకుంటారు. 21న  రాత్రి 7 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సభ వుంటుంది. 12 జిల్లాల మీదుగా, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా, 324 కిలోమీటర్లు  జి కిషన్ రెడ్డి  నేతృత్వంలో జన ఆశీర్వాద యాత్ర జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  మంత్రి వర్గ విస్తరణలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన విధానాన్ని వివరించనున్నారు. నరేంద్ర మోడీ  రైతాంగానికి లాభసాటి చేసే విధంగా విధానాలు రూపొందించడం, పేద ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ - అభివృద్ధి విషయాలను ప్రధానంగా ఈ యాత్రలో ప్రస్తావిస్తారు.

Related Posts