వైయస్సార్ జగనన్న ఇల్లు నిర్మాణాలను పరిశీలించిన మంత్రి అనిల్
నెల్లూరు
నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీ టిడ్కో ఇళ్ల ఎదురుగా వై.ఎస్.ఆర్. జగనన్న కాలనీలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండ త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) విదె ఖరె, నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు తదితరులు పాల్గొన్నారు.