మనబడి నాడు-నేడు పనులను ప్రారంభించిన 2వ డివిజన్ ఇంచార్జి రామ్మోహన్
నెల్లూరు
నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని 2వ డివిజన్ ప్రాంతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనబడి నాడు-నేడు పూర్తయిన పనులను స్థానిక డివిజన్ ఇంచార్జి పగిడి నేటి రామ్మోహన్ యాదవ్ ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల ప్రకారం 2వ డివిజన్ గుడిపల్లిపాడులోని జన్నత్ ఉసేన్ నగర్ లో ని ఉర్దూ పాఠశాలలలో 26 లక్షల రూపాయల వ్యయంతో పూర్తైన మరియు అల్లిపురంలోని పీ కే జీ కాలనీ లోని పాఠశాలలో 26.90 లక్షల రూపాయలతో మన బడి నాడు-నేడు పనులను ప్రారంభించడం ఆనందంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు .
పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందివ్వాలనే సంకల్పంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి నాడు-నేడు పధకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు సహకారం ఇవ్వడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ సేవలను కొనియాడారు. విద్యతోనే అన్ని రంగాలలో రాణించగలరు అనే నానుడి ప్రకారం గా ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత స్థాయి చదువులు చదివించాలని పిలుపునిచ్చారు. పై కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు పందిళ్లపల్లి శ్రీధర్ రెడ్డి, బేతనబోయిన శివరామయ్య,రాచురి రమేష్,కొమరిక నాగరాజు,కడిమి సుధాకర్,డాక్టర్ సుబ్బారావు, తాత పెంచలయ్య,సలీమ్, సత్తార్, మహాభాషా,షఫీ, రావినూతల మల్లికార్జున మరియు కార్యకర్తలు పాల్గొన్నారు