మైనార్టీ బంధు ఇవ్వండి : రేవంత్
హైదరాబాద్, ఆగస్టు 14
కారునో, పతంగినో నమ్ముకుంటే మోసపోయేది మీరే అంటూ మైనార్టీలను హెచ్చరించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. దళితుల కంటే కూడా ముస్లింలు వెనుకబడ్డారని చెప్పుకొచ్చిన ఆయన.. కాంగ్రెస్ మైనార్టీ గర్జన సభ ఓట్ల కోసం పెట్టలేదన్నారు. ఇప్పట్లో ఎన్నికలు లేవన్న విషయం గుర్తించాలన్నారు. యువత ఆత్మహత్యలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.. త్రిబుల్ తలాక్, ఎన్ఆర్సీ, సీఏఏ వంటి చట్టాలను వ్యతిరేకించింది కాంగ్రెస్ మాత్రమేనని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు.కాంగ్రెస్ దగ్గర 200 మంది ఎంపీలుంటే అలాంటి చట్టాలు తెచ్చే ధైర్యం చేసేవారా? కార్ కా స్త్రీరింగ్ అసద్ చేతిలో ఉందని చెప్పుకునే అసద్, త్రిబుల్ తలాక్ అనుకూలంగా రంజిత్ రెడ్డి ఎట్లా ఓటు వేస్తారు?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మైనార్టీలకు ఎవరివల్ల నష్టం జరుగుతుందో చెప్పాలనే మైనార్టీ గర్జన చేపట్టామని చెప్పిన రేవంత్, మైనార్టీలకు శత్రువైన కేసీఆర్‌ను కొట్టాలంటే మధ్యలో అసద్ అడ్డం ఉన్నాడు.. మోదీకి మద్ధతుగా నిలిచే కేసీఆర్ పార్టీని ఓడించాలి అని రేవంత్ రెడ్డి మైనార్టీలకు పిలుపునిచ్చారు.దళిత లెక్క.. మైనార్టీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనార్టీ బడ్జెట్, వక్ఫ్ బోర్డు జ్యూడిషరీ పవర్స్ కల్పిస్తామని హామీ ఇస్తున్న” అని రేవంత్ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన మైనార్టీ గర్జన సభలో వాగ్ధానం చేశారు