వైద్య సేవకు మించిన సేవ లేదు....
ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష, నగర మేయర్ సురేష్ బాబు
కడప ఆగస్టు14
కడపనగరములో సుదీక్ష వైద్యశాల ప్రారంభ కార్యక్రమములో మాట్లాడుతూ...సమాజ సేవలో వైద్య సేవ కు మించిన సేవ లేదు అని ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజద్ భాష, కడప నగర మేయర్ సురేష్ బాబులు పేర్కొన్నారు. శనివారం స్థానిక డి సి సి బ్యాంక్ పక్కన రాజా రెడ్డి వీధి లో సుదీక్ష వైద్యశాలను వారు ప్రారంభించి మాట్లాడుతూ తనకి డాక్టర్ సాన సురేష్, డాక్టర్ కందుల మానస లు వైద్య వృత్తిలో ఎంతో నైపుణ్యం ఉండి కడప నగర ప్రజలకు వైద్య సేవలు అందించడానికి వైద్యశాలను ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామమని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్, డాక్టర్ మానస మాట్లాడుతూ అన్ని రకాల కీళ్ళ వ్యాధులకు అత్యాధునిక పద్ధతిలో వైద్యం అందించబడును అని తెలిపారు, దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధిలకు, రూట్ కెనాల్స్ తక్కువ గాటుతో సర్జరీలు చేయబడును అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్పొరేటర్లు, ప్రముఖ డాక్టర్లు షఫీ, మురళీధర్, హరి ప్రసాద్, రమణ, రామ్మోహన్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.