ఏలూరు, ఆగస్టు 16,
సినిమా వాళ్లు సినిమా వాళ్లే. రాజకీయ నేతలు రాజకీయ నేతలే. ఇది అనేక ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. పార్ట్ టైం పాలిటిక్స్ కే సినిమా వాళ్లు ప్రిఫర్ చేస్తారు. అందుకే ఇప్పుడు సినిమా వాళ్లకు పాలిటిక్స్ లో పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. ప్రజలు కూడా వారిని ఆదరించడం లేదు. సొంత పార్టీ అయినా వారికి పెద్దగా పట్టదు. నాగబాబు విషయాన్నే తీసుకుంటే గత రెండేళ్ల నుంచి ఆయన జనసేన కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనింది లేదనే చెప్పాలి.పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఏపీ ఎన్నికలలో పోరాడేందుకు సిద్ధమయ్యారు. అన్నగా అండా ఉంటానని నాగబాబు మెగా ఫ్యామిలీ నుంచి ముందుకు వచ్చారు. పార్టీ లో చురుగ్గా పాల్గొన్నారు. ఇది చూసిన పవన్ కల్యాణ్ నాగబాబుకు నర్సాపుపరం పార్లమెంటు నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చారు. సొంత ప్రాంతం కావడం, మెగా ఫ్యామిలీ కావడంతో గెలుపు పెద్ద కష్టమేమీ కాదని భావించారు. కానీ అక్కడ ఓటమి పాలయినా మంచి ఫలితాలనే సాధించారు.రెండోస్థానంలో నిలిచిన నాగబాబు మరోసారి నరసాపురం వైపు చూస్తే ఒట్టు. ఎవరైనా ఒకసారి ఓటమి పాలయితే మరోసారి అక్కడ విజయం దక్కించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. అనేక సార్లు ఓటమి పాలయి చివరకు అదే నియోజకవర్గంలో గెలిచిన వారు కూడా ఉన్నారు. కానీ నాగబాబుకు మరసారి నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసే ఆలోచన లేనట్లుంది. అందుకే ఎన్నికల తర్వాత ఆవైపు వెళ్లలేదు.పార్టీ కార్యక్రమాలకు కూడా నాగబాబు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలను నాగబాబు తీసుకుంటే బాగుంటుదని జససేన కార్యకర్తలు సూచిస్తున్నారు. కానీ నాగబాబు మాత్రం రాజకీయాలంటే తనకు పడనట్లే వ్యవహరిస్తున్నారు. తమ్ముడి పార్టీని కూడా కాపాడాలన్న స్పృహ లేకపోతే ఎలా అని మెగా ఫ్యాన్స్ నుంచే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తం మీద నాగబాబు పార్టీలో ఉన్నారా? లేదా? అన్న సందేహం కూడా తలెత్తుతోంది.