రాయలసీమ రాష్ట్ర సాధన సమితి 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కడప ఆగస్టు 16
కడప జిల్లా రాయల సీమ రాష్ట్ర సాధన సమితి(RRSS) రాష్ట్ర మహిళా చీఫ్ ఇరగంరెడ్డి ప్రియదర్శిని రెడ్డి, రాష్ట్ర మహిళా ఉపా అధ్యక్షరాలు మిట్టా నాగేశ్వరమ్మ , ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల సమక్షంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ఇరగంరెడ్డి ప్రియదర్శిని రెడ్డి మాట్లాడుతూ కరోనా కారణం గా కొంచం జాప్యం జరుగుతుంది. ఉద్యమం విషయం లో కానీ త్వరలో ఉద్యమాన్ని ఉదృతం చేయక తప్పదు .రాజకీయపార్టీ ల వల్ల వెనుకబడిన రాయలసీమ కు ఎలాంటి ఉపయోగం లేదు అనడానికి తరతరాల మన రాయలసీమ వెనుకుబాటే నిదర్శనం కాబట్టి ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన తో నే సీమ కు బ్రతుకు భవిష్యత్ కాబట్టి మన నాయకులు ఇరగంరెడ్డి ఆదేశానుసారం త్వరలో పోరు బాట పట్టక తప్పదు. మహిళలు బాధ్యత గా బిడ్డ ల భవిష్యత్ కోసం స్వరాష్ట్ర సాధన లో విరివిగా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది అని పిలుపు నిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరం లు గడిచిన రాయలసీమ ప్రయోజనాలేవి, ప్రభుత్వం ఆలోచన చేసిన దాకలాలు లేవు. కడప ఉక్కు పరిశ్రమ, రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టు లు ఇంకా అట్లే ఉన్నాయి రైతు లు నిరుద్యోగ యువత బ్రతుకు లు ప్రశ్నర్ధాకం గా మారాయి. సీమ ప్రజలు బాధ్యత గా భవిష్యత్ తరాలకోసం అయినా స్వరాష్ట్ర సాధన ఉద్యమబాట పట్టక తప్పదు అని ఆమె పిలుపు నిచ్చారు. రాష్ట్ర మహిళా ఉపా అధ్యక్షరా లు నాగేశ్వరమ్మ మాట్లాడుతూ... నాయకులు ఓట్ల నాడు మాత్రమే ప్రజల ముందు కు వస్తారు సీట్లు ఎక్కాక ప్రజల మాటే ఎత్తడం లేదు. ముఖ్యం గా రాయలసీమ విషయం లో నాయకులు నోరే విప్పరు అసంబ్లీ ల లో రాయలసీమ అవసరాలు కోసం ప్రయోజనాలు కోసం. కేవలం స్వార్థం తో రాజకీయ నాయకులే రాయలసీమ గొంతు కోస్తా వున్నారు. తరతరాలు గా... కాబట్టి ఇక ఇప్పుడు సీమ బిడ్డ లు ముఖ్యం గా మహిళా లు బాధ్యత గా భవిష్యత్ తరాల బ్రతుకు కోసం ఖచ్చితంగా రోడ్లు ఎక్కాలి. ఇక స్వేచ్ఛ కోసం స్వాతంత్రo కోసం రాయలసీమ ఆస్థిత్వo కోసం అని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో మహిళా కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు