YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఆరు నెలల్లో కొత్త జి ఎస్ టి విదానం

ఆరు నెలల్లో  కొత్త  జి ఎస్ టి విదానం

వస్తుసేవల పన్ను రిటర్న్‌ల దాఖలు సరళీకరణకు జీఎస్టీ మండలి ఆమోదం తెలిపింది. నెల నెలా ఒక పేజీతో కూడిన రిటర్న్‌లు సమర్పించే కొత్త విధానాన్ని ఆరు నెలల్లో అమలులోకి తీసుకు రావాలని తీర్మానించింది. అప్పటి వరకు ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది. జీఎస్టీ నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయి ప్రభుత్వ సంస్థగా మార్చేందుకు అంగీకారం తెలిపింది. చక్కెరపై వస్తుసేవల పన్నుకు అదనంగా సుంకం విధించడంపై నిర్ణయాన్ని జీఎస్టీ మండలి వాయిదా వేసింది. ఆ అంశంపై తదుపరి సమావేశం నాటికి తగిన సిఫార్సులు చేసే బాధ్యతను ఐదు రాష్ట్రాల ఆర్థికమంత్రులతో కూడిన బృందానికి అప్పగించింది. డిజిటల్‌ చెల్లింపులు జరిపిన వారికి రెండు శాతం ప్రోత్సాహం అందించడంపై సూచనలు అందించాలని మరో ఐదు రాష్ట్రాల ఆర్థికమంత్రుల బృందాన్ని జీఎస్టీ మండలి కోరింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ... ‘‘ ప్రస్తుతం జీఎస్టీఎన్‌లో ప్రభుత్వానికి 49శాతం, ఇతర సంస్థలకు 51శాతం వాటా ఉంది. ప్రైవేటు సంస్థల దగ్గరున్న 51శాతం వాటాను ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. జీఎస్టీఎన్‌లో ఇకపై కేంద్ర ప్రభుత్వం 50శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిపి 50శాతం వాటా కలిగి ఉంటాయి. జీఎస్టీ రిటర్నుల దాఖలుకు ప్రత్యామ్నాయంపైనా చర్చ జరిగింది’’ అని వివరించారు. 

Related Posts