YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నాడు-నేడు రెండవ విడత ప్రారంభించిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

నాడు-నేడు రెండవ విడత ప్రారంభించిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

నాడు-నేడు రెండవ విడత ప్రారంభించిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
విశాఖపట్నం
రాష్ట్రంలో విద్యకు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ నిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఏస్ జగన్మోహన్ రెడ్డి కేటాయిస్తున్నారని పాడేరు శాసనసభ సభ్యు రాలు భాగ్యలక్ష్మి  అన్నారు.సోమవారం లోచలిపుట్టు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలురు పాఠశాలలో నాడు-నేడు రెండవ విడత కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గున్నారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విద్య కోసం అమ్మ ఒడి అనే కార్యక్రమం ప్రవేశపెట్టారని చెప్పారు.ఏజెన్సీలో చదువుతున్న గిరిజన విద్యార్థి విద్యార్థినిలు బాగా చదువుకొని ఉన్నతమైన శిఖరాలను అధిగమించాలని అన్నారు.ప్రవేటు కాలేజిలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి విద్యార్థినిలు బాగా చదువు కోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గున్న ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ రోణంకి మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమంలో ఏజెన్సీలో అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలలో11 మండలలలో మొదటి విడత 367 పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమం జరిగిందని పాడేరు నియోజకవర్గ పరిధిలో 158 పాఠశాల లలో 4668-49లక్షల రూపాయలు ఖర్చు చేసి నాడు నేడు పనులు చేపట్టారని తెలిపారు.అంతకుముందు పాఠశాలలో సరస్వతి విగ్రహానికి,అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి  నిర్వహించారు.ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం మొదలు పెట్టారు.ఈ పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువు తున్న విద్యార్ధి విద్యార్థినిలకు బ్యాగులు,బూట్లు,బెల్టులు,డిక్షనరీలు,నోటు పుస్తకాలు ఎమ్మెల్యే మరియు పిఓ చేతులు మీదుగా జగనన్న విద్య కానుకగా కిట్లను పంపినిచేశారు.

Related Posts