ఆధార్ కేంద్రాల్లో తిప్పలు పడుతున్న ఆదివాసులు
ఆదివాసీ ప్రాంత సచివాలయ పరిధిలో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
విశాఖపట్నం
విశాఖ ఆదివాసి ప్రాంతంలో ఆధార్ కేంద్రాల చుట్టూ ఆదివాసుల ప్రదర్శనలు చేస్తు ,చెప్పులరిగేలా తిరుగుతున్నప్పటికి టెక్నికల్ ప్రాబ్లంతో చేతులెత్తేస్తున్న సిబ్బంది. ఆదివాసి ప్రాంత సచివాలయం పరిధిలో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సిపిఐ పార్టీ పాడేరు మండల కార్యదర్శి కూడ రాధాకృిష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో పిల్లలు ,పిల్లల తల్లిదండ్రులు భయాందోళనలు చెందుతున్నప్పటికి పిల్లలు తల్లిదండ్రులు ఆధార్
ఈ కే వైసీ ఈ నెల 20వ తేదీ లోపు చేసుకోవాలని లేనిపక్షంలో రేషన్ కోటా బియ్యం ఆపేస్తామని ఆదేశాలు జారిచేయడంతో వ్యవసాయ పనులు మానుకొని చంటి పిల్లల తో రోజు పాడేరు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.ఆధార్ కేంద్రం లో వచ్చే సరికి టెక్నికల్ ప్రాబ్లంతో చేతులు ఎత్తేస్తున్నారని అధికారులు స్పందించి మండల కేంద్రాల గ్రామ సచివాలయ పరిధిలో ఆధార్ కేంద్రాలు ఏర్పాటుచేసి ఆదార్ సేవలందించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మనోజ్ కుమార్, కిరణ్, పిల్లలు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.