YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పరామర్శించడానికి వెళ్తే అరెస్టులా ?   ఐపీసీ సెక్షనా ?  వైసిపి సెక్షనా ? ఆటవిక రాజ్యమా ? ప్రజాస్వామ్యమా ?

పరామర్శించడానికి వెళ్తే అరెస్టులా ?   ఐపీసీ సెక్షనా ?  వైసిపి సెక్షనా ? ఆటవిక రాజ్యమా ? ప్రజాస్వామ్యమా ?

పరామర్శించడానికి వెళ్తే అరెస్టులా ?  
ఐపీసీ సెక్షనా ?  వైసిపి సెక్షనా ? ఆటవిక రాజ్యమా ? ప్రజాస్వామ్యమా ?
లోకేష్ అరెస్టు దారుణం
వైసిపి తీరుపై నిప్పులు చెరిగిన  జయ నాగేశ్వర్ రెడ్డి
మంత్రాలయం : అత్యంత కీరాతకంగా హాత్య  చేయబడిన అమ్మాయి ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులను  పరామర్శించడానికి వెళ్ళిన  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబును అరెస్టు చేస్తారా ??  ఇది ఐపీసీ సెక్షనా ?  వైసిపి సెక్షనా ? అని  ప్రభుత్వం పోలీసుల తీరుపై పై  ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయ నాగేశ్వర్రెడ్డి నిప్పులు చెరిగారం.నిన్నటి రోజున గుంటూరులో దళిత యువతి రమ్యను నడి రోడ్డు పై కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా హత్య చేయడం జరిగినది. హత్య కాబడిన రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళుతున్న టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి  గౌ శ్రీ నారా లోకేష్ గారిని మరియు టిడిపి నాయకులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ మరియు మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మీడియా సభ్యుల కెమెరాలను పోలీసులు లాక్కోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు...
 పోలీసుల వైఖరి - నశించాలి, ప్రజా స్వామ్యాన్ని ఖుని చేస్తున్న CM - డౌన్ డౌన్, నియంత CM జగన్ - డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కర్నూల్ టిడిపి  పార్టీ కార్యాలయంలో టిడిపి కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు గౌ శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారితో కలిసి నిరసన తెలిపి పాత్రికేయ సభ్యులతో మాట్లాడుతూ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీసీ  కోడ్ అమలౌతుందో వైసీపీ  కోడ్ అమలౌతుందో అర్థం కావడం లేదని అన్నారు. రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి అరెస్టు కాబడిన టిడిపి నాయకులను వేంటనే విడుదల చేయాలని  ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు గౌ శ్రీ డా బి వి జయనాగేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు.

Related Posts