YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో కమలానికి లీడర్లు...కావలెను

విశాఖలో కమలానికి లీడర్లు...కావలెను

విశాఖపట్టణం, ఆగస్టు 17, 
బీజేపీకి అత్యంత కీల‌క‌మైన ఉత్తరాంధ్రలోని విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఇప్పుడు పార్టీ కీల‌క నాయ‌కుడిని దూరం చేసుకున్నట్టు అయింది. ఇక్కడ చ‌క్రం తిప్పిన‌.. కీల‌క నేత‌.. కంభం పాటి హ‌రిబాబు ఇటీవ‌ల మిజోరం రాష్ట్ర గ‌వ‌ర్నర్‌గా ప్రమోష‌న్‌పై వెళ్లిపోయారు. దీంతో ఆయ‌న ప్రభావం దాదాపు త‌గ్గిపోతుంది. ఇక‌, ఇప్పటికి ఉన్న నేత‌ల్లో ఎమ్మెల్సీ మాధ‌వ్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నా.. ఈయ‌న‌కు పోటీగా కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వరి కూడా దూకుడు చూపిస్తార‌ని అంటున్నారు. గ‌తంలో ఇక్కడ నుంచి పోటీ చేసి ఎంపీగా కూడా గెలిచిన ఆమె గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు.అయితే.. అప్పటి వ‌ర‌కు హ‌రిబాబు ప్రభావం ఉంద‌ని.. అందుకే కొంద‌రు నేత‌లు పుంజుకోలేక పోతున్నారనే వాద‌న వినిపించేది. కానీ, ఇప్పుడు హ‌రిబాబు బీజేపీకి దూర‌మ‌య్యారు. ఆయ‌న ప్రభావం ఉండే అవ‌కాశం లేదు. దీంతో ఇప్పుడు కీల‌క‌మైన విశాఖ రాజ‌కీయాల్లో ప‌ట్టు సాధించేది ఎవ‌రు? అనే ప్రశ్న తెర‌మీదికి వ‌చ్చింది. ఇటీవ‌ల ఎమ్మెల్సీ మాధవ్ ఉత్తరాంధ్ర జిల్లాలో గాంధీ సంక‌ల్ప యాత్ర పేరిట స‌మ‌స్యలు తెలుసుకునే ప్రయ‌త్నం చేశారు. దీనిపై పెద్దగా ఫోక‌స్ రాక‌పోయినా.. ఆయ‌న మాత్రం విశాఖ‌పై ప‌ట్టు బిగించేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న స‌మ‌స్యలు ప‌రిష్కరించేందుకు కృషి చేస్తున్నాన‌ని ఆయ‌న చెబుతున్నారు.కానీ, విశాఖ‌పై ప‌ట్టు సాధించాలంటే.. కీల‌క‌మైన రెండు పార్టీలు.. వైసీపీ, టీడీపీల‌ను బ‌లంగా ఎదుర్కొనాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని.. పైగా పారిశ్రామికంగా , సామాజిక వ‌ర్గం ప‌రంగా కూడా ప‌ట్టు సాధించాల్సి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. మాధ‌వ్ ఈ త‌ర‌హా రాజ‌కీయం చేసే ప‌రిస్థితి లేద‌ని.. కుండ‌బ‌ద్దలు కొడుతున్నారు. ఏదైనా ఉంటే.. పురందేశ్వరి వంటి బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం అండ‌దండ‌లు ఉన్న నాయ‌కురాలు వ‌స్తే.. బాగానేఉంటుంద‌ని అంటున్నారు. అయితే.. ఆమె రాక‌ను ఇక్కడి బీజేపీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.ఇక ఎక్కడో ప్రకాశం జిల్లాకు చెందిన ఆమె గ‌తంలో కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఎంపీ అవ్వడంతో పాటు కేంద్ర మంత్రి అయ్యి పెత్తనం చేశారు. ఇప్పుడు బీజేపీలో కూడా ఆమెకు ఇక్కడ ప్రధాన బాధ్యత‌లు ఇస్తే ఇక్కడే పాత‌ుకుపోయి… త‌మ‌పై పెత్తనం చేస్తార‌ని.. స్థానికేత‌రురాల‌ని.. అంత‌ర్గత ప్రచారం చేస్తున్నారు. దీంతో విశాఖ‌పై ప‌ట్టు సాధించ‌డం బీజేపీ నేత‌లు క‌త్తిమీద సాముగా మారింద‌ని అంటున్నారు. ఏదేమైనా విశాఖ బీజేపీకి ఇప్పుడు అర్జెంటుగా ఓ లీడ‌ర్ అయితే కావాల్సి ఉంది. మ‌రి ఈ లోటును ఎవ‌రు భ‌ర్తీ చేస్తారో ? చూడాలి.

Related Posts