కాబుల్ కు విమానాల రాకపోకలు షురూ
కాబుల్
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్ కు విమానాల రాకపోకలు పునరుద్దరించారు. తాలిబన్లకు దేశం వశమవడంతో సోమవారం నాడు ప్రజలు పెద్ద ఎత్తున హమీద్ కర్జాయ్ విమానాశ్రయానికి పోటెత్తారు. దొరికిన విమానాలను ఎక్కేందుకు ప్రయత్నించారు. తొక్కిసలాటకు ఐదుమంది, విమానం నుంచి జారిపడి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి మిలటరీ విమానాలు రాయబార కార్యాలయ సిబ్బంది, పౌరులను తరలించడం ప్రారంభమయ్యాయి. వందలాది ఆఫ్ఘన్ సైనికులు సరిహద్దు దేశాలు ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్ లకు పారిపోయారు. బ్రిటన్ మరో 200 సైనికులను ఆఫ్ఘనిస్థాన్ కు పంపింది. ఈ వారాంతానికి మరో 600 మంది సైనికులను పంపనుంది.