గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ మాస ఉత్సవాలు నిర్వహించండి
బిజెపి నాయకుల డిమాండ్
పులివెందుల
రాయలసీమలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా శ్రావణ మాస ఉత్సవాలు నిర్వహించాలని బీజేపీ కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వoగల శశి భూషణ్ రెడ్డి కిషన్ రెడ్డి తో పాటు పలువురు బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం గండి ఏ సీ ముకుంద రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఆలయంలో కూడా నిబంధనల పేరుతో భక్తుల ప్రవేశాలను అడ్డుకోలేరన్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత ఊరు పులివెందులలో ఇలాంటి పరిస్థితి నెలకొందని వారు ధ్వజమెత్తారు. కేవలం హిందువులకు మాత్రమే ఇలాంటి ఆంక్షలు పెట్టడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో హరి, సుష్మ, శ్రీరాములు లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించక పోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు