బీటెక్ విద్యార్థిని దారుణ హత్య అమానుషం
దశ దిశ లేని దిశ యాప్ మహిళలకు రక్షణ కలిగించేనా?
బిజెపి మహిళా నేత కందికట్ల రాజేశ్వరి
నెల్లూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కొరకు నూతనంగా ప్రారంభించబడిన దిశ యాప్ ప్రారంభ ఆరంభ దశలోనే గుంటూరు పట్టణ నడిబొడ్డున బీటెక్ విద్యార్థిని, దళిత యువతి దారుణంగా హత్య కాపాడిందని, ఇది ప్రభుత్వ అ నిర్లక్ష్య చర్యలకు కారణమేనని నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కందికట్ల రాజేశ్వరి పేర్కొన్నారు. ఈ దారుణం స్వాతంత్ర దినోత్సవం నాడు జరగడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ యాప్ ఏర్పాటు చేయబడింది అని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప, దిశ యాప్కు దశ లేదన్నారు. రాష్ట్రమంతా స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో దిశ యాప్ చట్టానికి దశే లేదని చెప్పు కు నిదర్శనంగా గుంటూరులో ఈ దారుణ హత్య ఉందన్నారు. రమ్య శ్రీ ని పట్టపగలే నడిరోడ్డుపై విచక్షణారహితంగా నరికి చంపిన నిధులు శశి కృష్ణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టకపోవడం ఏంటని ప్రశ్నించారు. దారుణ హత్య పై ప్రభుత్వ స్పందన చూసినట్లయితే రాష్ట్రంలో దళితుల పై ఉన్న ప్రేమ ఏంటో స్పష్టంగా తెలుస్తుంది అన్నారు. ఇటువంటి మారణకాండలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితుడు శశి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి నేపథ్యాలను పరిశీలించిన పిదప తల్లిదండ్రులు కూడా వారి వారి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఆడపిల్లల యోగక్షేమాలు పై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వారి ప్రవర్తన పై దృష్టిపెట్టి తమ పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గంటా విజయశ్రీ ,కరణం సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.