YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

తాలిబ‌న్ల‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాలి నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత మాలాలా మ‌హిళ‌లు ఇండ్ల‌లో సెక్స్ బానిస‌లుగా మ‌గ్గాల్సిందే బంగ్లాదేశ్ ర‌చయిత్రి త‌స్లీమా నస్రీన్ ఆందోళ‌న

తాలిబ‌న్ల‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాలి నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత మాలాలా మ‌హిళ‌లు ఇండ్ల‌లో సెక్స్ బానిస‌లుగా మ‌గ్గాల్సిందే బంగ్లాదేశ్ ర‌చయిత్రి త‌స్లీమా నస్రీన్ ఆందోళ‌న

తాలిబ‌న్ల‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాలి
నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత మాలాలా
మ‌హిళ‌లు ఇండ్ల‌లో సెక్స్ బానిస‌లుగా మ‌గ్గాల్సిందే
బంగ్లాదేశ్ ర‌చయిత్రి త‌స్లీమా నస్రీన్ ఆందోళ‌న
న్యూఢిల్లీ ఆగష్టు 17
తాలిబ‌న్ల‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత మాలాలా యూసుఫ్‌జాహి ప్ర‌పంచ దేశాధినేత‌ల‌ను కోరింది.  ఆఫ్ఘ‌నిస్తాన్‌లో చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో మ‌హిళ‌లు, బాలిక‌ల ర‌క్ష‌ణ స‌మ‌స్యాత్మ‌కంగా మారిన‌ట్లు ఆమె వెల్ల‌డించింది. ఆఫ్ఘన్ విష‌యంలో అనేక మంది దేశాధినేత‌ల‌తో సంప్ర‌దింపులకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు మలాలా తెలిపారు. ఆఫ్ఘ‌న్ దేశంలో తీవ్ర మాన‌వ సంక్షోభం ఏర్ప‌డింద‌ని, ఆ దేశ ప్ర‌జ‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆమె తెలిపింది. ఆఫ్ఘ‌న్ ర‌క్ష‌ణ కోసం బైడెన్ ఎంతో చేయాల‌ని, చాలా ధైర్య‌మైన అడుగు వేయాల‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేసింది.2012లో పాకిస్థాన్‌లోని తాలిబ‌న్లు జ‌రిపిన కాల్పుల్లో మ‌లాలా యూసుఫ్‌జాహి గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. కాగా..
ఆఫ్ఘ‌నిస్థాన్‌ను తాలిబ‌న్లు స్వాధీనం చేసుకోవ‌డంతో ఇక అక్క‌డి మ‌హిళ‌లు ఇండ్ల‌లో సెక్స్ బానిస‌లుగా మ‌గ్గాల్సిందేన‌ని బంగ్లాదేశ్ ర‌చయిత్రి త‌స్లీమా నస్రీన్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కాబూల్‌లోని గోడ‌పై మ‌హిళ చిత్రాన్ని ఓ వ్య‌క్తి చెరిపేస్తున్న ట్విట‌ర్ ఫోటోపై కామెంట్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు. తాలిబ‌న్లు మ‌హిళ‌ల‌ను ఎక్క‌డా క‌నిపించ‌కుండా చేస్తార‌ని..మ‌హిళ‌లు ఇండ్ల‌లోనే సెక్స్ బానిస‌లుగా మ‌గ్గిపోతూ పిల్ల‌ల్ని క‌నే యంత్రాలుగా ఉండాల‌ని వారు భావిస్తార‌ని అన్నారు.ఇస్లాం స్త్రీ వ్య‌తిరేకత‌తో కూడిన‌ద‌ని తస్లీమా న‌స్రీన్ వ‌రుస ట్వీట్ల‌లో వ్యాఖ్యానించారు. 1996 నుంచి 2001 వ‌ర‌కూ సాగిన తాలిబ‌న్ల అరాచ‌క పాల‌న‌లో మ‌హిళ‌లు ప‌నిచేయ‌డంతో పాటు టీవీ, మ్యూజిక్‌ను నిషేధించార‌ని..వారు తిరిగి ఇవే నిబంధ‌న‌ల‌ను తిరిగి విధిస్తారా అని ఆమె ప్ర‌శ్నించారు. ఏ ఒక్క ముస్లిం దేశం కూడా మ‌హిళ‌ల‌ను సాటి మ‌నుషులుగా వ్య‌వ‌హ‌రించ‌ద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Related Posts