న్యుమోనియాపై టీకా అస్త్రం
న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ)
చిన్నారులకు రక్ష
ప్రభుత్వ ఆధ్వర్యంలో నేటి నుండి ఉచిత పంపిణీ
జగిత్యాల ఆగస్టు 17
చిన్నారులకు అత్యంత ప్రమాదకరంగా మారుతున్న వ్యాధుల్లో ‘న్యుమోనియా ముఖ్యమైనది న్యుమోకోకల్ బ్యాక్టీరియా వల్ల వచ్చే న్యుమోనియా, మెనింజైటిస్ (మెదడువాపు) వంటి వ్యాధులను నివారించేందుకు ఈ టీకా ఇవ్వనున్నారు, న్యుమోకోకల్ బ్యాక్టీరియాతో బ్యాక్టీరీమియా (రక్తంలో ఇన్ఫెక్షన్), సైనస్, చెవి ఇన్ఫెక్షన్ల వంటివి కూడా వస్తాయని, చిన్నారులకు రిస్క్ ఎక్కువగా ఉంటుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ తెలిపారు. ఈవ్యాధి కారణంగా ఏటా చిన్నారులు దేశంలో సుమారు 1.4 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని , చిన్నారుల మరణాల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు న్యుమోనియా కారణంగానే మృతి చెందుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని , ఈవ్యాధిని నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ)’ను అందుబాటులోకి తీసుకొచ్చిందని జిల్లా వైద్యాధికారి తెలిపారు.
ఈ పీసీవీ టీకాను ఇప్పుడు సార్వత్రిక టీకా కార్యక్రమంలో జత చేస్తూ ప్రభుత్వ వైద్యంలో ఉచితంగా అందజేయనున్నారని , న్యుమోనియా కారక మరణాలు అత్యధికంగా నమోదవుతున్న బిహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పటికే దీనిని ప్రారంభించారని జిల్లా వైద్యాధికారి తెలిపారు.
పోలియో, రోటా, పెంటావాలెంట్ వ్యాక్సిన్ల లాగానే పీసీవీనీ ఒక్కొక్కరికి మూడు డోసులు
ఇవ్వనున్నారని , ఈటీకాను 3 దశల్లో 0.5 మిల్లి చొప్పున ఇస్తారని , పుట్టిన 6 వారాలకు తొలిడోసు 14 వారాలకు మలిడోసు ఇవ్వాల్సి ఉంటుందని , బూస్టర్ డోసును శిశువు పుట్టిన 9 నెలలకు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి తెలిపారు.
నేడే తెలంగాణ రాష్ట్రం ప్రారంభోత్సవం
తెలంగాణలో బుధవారం 18-08-2021
నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ టీకాను సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో జతచేసి ప్రారంభించడానికి వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేసిందని , కావున జగిత్యాల జిల్లాలో ప్రతి పట్టణ ప్రాథమిక, సామాజిక మరియు జిల్లా ఆసుపత్రుల్లో , గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో ప్రతి బుధ, శనివారాల్లో మొదటి మోతాదు (పోలియో, పెంటావాలెంట్ మరియు రోటా వ్యాక్సిన్) కు అర్హత ఉన్న పిల్లలు మాత్రమే ఈ టీకాకు అర్హులని అందరూ దీన్ని సద్వియోగపరచుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ తెలిపారు.
ఏటా 6.35 లక్షల మందికి లబ్ధి
జిల్లా వైద్యాధికారి డా. పీ.శ్రీధర్
ప్రైవేటు వైద్యంలో టీకా ఇప్పటికే అందుబాటులో ఉన్నా ఖరీదు ఎక్కువగా ఉండడంతో... ఎక్కువ మంది ముందుకురావడం లేదు. తెలంగాణలో ఏడాది లోపు శిశువుల సంఖ్య ఏటా 6.35 లక్షలుగా నమోదవుతుండగా... ఇప్పుడు ప్రభుత్వ వైద్యంలో టీకా ఉచితంగా అందుబాటులోకి వస్తుండడంతో... ఏడాదిలోపు చిన్నారులకు ప్రయోజనం కలుగుతుందని వైద్యవర్గాలు తెలిపాయి.