YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పీసీసీ చీఫ్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి? ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలకపరిణామాలు

పీసీసీ చీఫ్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి? ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలకపరిణామాలు

పీసీసీ చీఫ్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి?
    ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలకపరిణామాలు
విజయవాడ ఆగష్టు
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. తాజాగా మారుతున్న పరిణామాల నేపద్యం లో ఆయన పేరును పార్టీ అగ్రనేత.. రాహుల్ గాంధీ పరిశీలనకు తీసు కున్నట్లు వినికిడి. ఇటీవల ఏపీకి చెందిన కీలక నేతలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే అకస్మాత్తుగా.. కిరణ్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆయన గురించి కొద్దిసేపు రాహుల్ గాంధీ సదరు నేతలతో విస్తృతంగా చర్చించారట. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ లో కీలకపరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీలో ఇటీవల పరిణామాలను కూడా రాహుల్.. సీనియర్లతో చర్చించినట్టు తెలుస్తోంది. విషయంలోకి వెళ్తే.. ఇటీవల రాహుల్ గాంధీ ఏపీకి చెందిన నేతలతో విడివిడిగా సమావేశం అయ్యారు. ముఖ్యమైన నాయకులను ఢిల్లీ పిలిపించుకుని మరీ.. ఆయన ఏపీ పరిణామాలు ఏపీలో పార్టీ పరిస్థితిపైనా చర్చించినట్టు తెలిసింది. వీరిలో పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ శైలజానాథ్తోపాటు.. చాలా మంది నాయకులు ఉన్నారని సమాచారం.ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి 2014లో ఎలా ఉందో అలానే ఉందనేది వాస్తవం. రాష్ట్ర విభజన తర్వా త.. పార్టీ పూర్తిగా దెబ్బతింది. ఇద్దరు పార్టీ చీప్ ను మార్చినా.. పార్టీ పుంజుకోలేదు. ముఖ్యంగా పార్టీకి బల మైన రెడ్డి సామాజిజక వర్గాన్ని ఎవరూ ఓన్ చేసుకోలేక పోయారు. ఈ క్రమంలోనే పార్టీ చీఫ్ను మార్చాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. దీనికి సాకే తరఫున వాదన కూడా బలంగా వినిపిస్తోంది. తనకు సీనియర్లు ఎవరూ సహకరించడం లేదని.. తాను చీఫ్గా ఉండి ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.ఈ క్రమంలోనే రాజీనామాకు రెడీ అయ్యారని కాంగ్రెస్లో చర్చ సాగుతోంది. మరీ ముఖ్యంగా సీనియర్ నేతలు కేంద్ర మాజీ మంత్రులు.. జేడీ శీలం ఎం.ఎం. పళ్లంరాజు మెగాస్టార్ చిరంజీవి వంటివారు.. యాక్టివ్గా లేకపోవడాన్ని ఈ సందర్భంగాసాకే రాహుల్కు వివరించినట్టు సమాచారం. జాతీయ నేతలు వచ్చినప్పుడు మాత్రమే వారు కనిపిస్తున్నాయని లేకపోతే.. ఇంటికే పరిమితం అవుతున్నారని.. కనీసం .. స్పందించడం లేదని సాకే వివరించినట్టు తెలిసింది. ఈ పరిణామాలు ఇలానే ఉంటే.. పార్టీ కోలుకోవడం కష్టమనే వాదనను ఆయన తెరమీదికి తీసుకువచ్చినట్టు తెలిసింది.అయితే అనూహ్యంగా ఆయా అంశాలపై.. చర్చించి.. పరిష్కారం చూపించాల్సిన రాహుల్ గాంధీ.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ పేరు ను ప్రస్తావించారట. కిరణ్కుమార్ను పీసీసీ చీఫ్ చేయడంపై ఆయన సీనియర్ల ను సలహా కోరినట్టు సమాచారం. దీనికి సీనియర్లు కూడా సరే అన్నారని.. ఆయన వస్తే.. రెడ్డి సామాజిక వర్గం.. పార్టీవైపు మొగ్గు చూపుతుందని.. చెప్పినట్టు తెలిసింది.

Related Posts