YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సామినేనికి లైన్ క్లియరేనా

సామినేనికి లైన్ క్లియరేనా

విజయవాడ, ఆగస్టు 18, 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాజికవర్గాల ఆధారంగా వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో సామాజికవర్గాలకు అనుగుణంగా పదవులను పంపిణీ చేస్తున్నారు. ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తూనే ప్రధాన సామాజికవర్గాలను కూడా వైసీపీ అధినేత జగన్ విస్మరించడం లేదు. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఆయన పదవులను భర్తీ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రాతినిధ్యం వహిస్తున్న జగ్గయ్యపేటలోనూ అదే తీరుగా పదవుల భర్తీ జరిగింది.సామినేని ఉదయ భాను పదేళ్ల తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో సామినేని ఉదయభాను జగ్గయ్యపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ లో వైఎస్ కు వీరవిధేయుడిగా ఉన్న సామినేని ఉదయభాను కాపు సామాజికవర్గానికి చెందిన నేత. జగ్గయ్యపేటలో నందిగామ నియోజకవర్గం ప్రభావం కూడా ఉంటుంది. ఇక్కడ కమ్మ, కాపు సామాజిక వర్గానికి నిత్యం గొడవలే ఉంటాయి.రెండు సార్లు సామినేని ఉదయభాను ఓటమి పాలయింది కమ్మ సామాజికవర్గం ఓట్ల కారణంగానే. అందుకే ఆ సామాజికవర్గాన్ని మంచి చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ నుంచి టీడీపీ తరుపున రెండుసార్లు విజయం సాధించిన శ్రీరాం తాతయ్య వైశ్య సామాజికవర్గానికి చెందిన నేత. ఆయనకు కమ్మ సామాజికవర్గం అండగా ఉండటంతోనే రెండు దఫాలుగా విజయం సాధ్యమయింది.సామినేని ఉదయభాను తన నియోజకవర్గంలో ఉన్న 32 వేల కమ్మ సామాజికవర్గం ఓట్లపై కన్నేశారు. అందుకే అదే సామాజికవర్గానికి చెందిన తన్నీరు నాగేశ్వరరావుకు పదవి ఇప్పించుకోగలిగారు. ఆయనకు డీసీసీబీ ఛైర్మన్ పదవి ఇవ్వడంతో కమ్మ సామాజికవర్గం ఓట్లు వైసీపీ వైపు మళ్లుతాయన్న అంచనాలో సామినేని ఉదయభాను ఉన్నారు. కానీ జిల్లాలో ఉన్న పరిస్థితుల కారణంగా ఆ సామాజికవర్గం సామినేని ఉదయభానుకు ఏ మేరకు మద్దతిస్తుందనేది చూడాల్సి ఉంది. మొత్తం మీద అన్ని సామాజికవర్గాలను మచ్చిక చేసుకుని వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించాలనుకుంటున్న సామినేని ఉదయభాను ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది.

Related Posts