YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలలో అంగన్ వాడీ

ప్రభుత్వ పాఠశాలలో అంగన్ వాడీ

గుంటూరు, ఆగస్టు 18, 
ప్రభుత్వ పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాల విలీనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కరోనా తరువాత సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బడులను ప్రారంభించడంతో ఈ పనులను మరింత వేగవంతం చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు కిలోమీటరు దూరంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించాలని ఇప్పటికే ప్రభుత్వం స్త్రీ శిశుసంక్షేమ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 3,793 అంగన్‌ వాడీ కేంద్రాలు స్కూళ్లకు దగ్గర్లో ఉన్నాయని గుర్తించారు. వీటిలో ముందుగా అద్దె భవనాల్లో ఉన్న కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లోకి తరలించాలని చెప్పడంతో వాటిని గుర్తించే పనిలో స్త్రీ శిశుసంక్షేమ శాఖ నిమగమైంది. ఈ అంగన్‌వాడీ కేంద్రాలన్నిటినీ పాఠశాలల్లోకి తరలించడం వల్ల కొన్నిచోట్ల గదులు చాలవని గుర్తించారు. దీంతో అదనపు గదులను నిర్మించేంత వరకూ అంగన్‌వాడీ కేంద్రాలను యథావిధిగా ఉన్నచోటే కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు కిలోమీటరు దూరంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను పాఠశాలల్లో విలీనం చేసి వాటిని ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ-2గా పేరు మార్చనున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు దూరంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లుగా పేరు మార్చి వాటిలో కూడా ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ-2 తరగతులను నిర్వహించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేసిన తరువాత పాత పద్ధతిలోనే ఈ ప్రీ ప్రైమరీ 1, 2 తరగతులకు అంగన్‌వాడీ టీచర్లే పాఠాలను బోధించను న్నారు. నిర్వహణ బాధ్యతను స్త్రీ శిశు సంక్షేమ శాఖనే చూడనుంది. విలీనానికి ఎటువంటి ఇబ్బందీ లేకపో యినా కొన్నిచోట్ల గదులు చాలవని విద్యాశాఖ చెబుతోంది. దీంతో ఎక్కడెక్కడ ఎన్ని అదనపు గదులు అవసరం, నాడు-నేడులో ఇప్పటి వరకూ ఎన్ని గదులను నిర్మించారు? వంటి వివరాలను ప్రభుత్వం కోరినట్లు తెలు స్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటి వరకూ గర్భిణులు, బాలింతలు వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ కింద తీసుకుంటున్న పౌష్టికాహారాన్ని కూడా ఇక మీదట స్కూళ్లకు వెళ్లే తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారునూతన విద్యావిధానంలో భాగంగా ఆరు రకాల పాఠశాలల ఏర్పాటు విధివిధానాలపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని నిర్ణయాలను విద్యాశాఖ తీసుకుంది. ప్రీ ప్రైమరీ-1 (పిపి1), ప్రీ ప్రైమ రీ-2 (పిపి2) తరగ తులు, ఉద్యోగులతో విద్యా శాఖకు సంబంధం ఉండదు. శిశుసంక్షేమ శాఖలో ఉంటాయని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వారికి కావాల్సిన బోధనా సామగ్రి మాత్రం విద్యాశాఖ అందిస్తుంది. అంగన్‌వాడీల్లోని పిపి-1, పిపి-2 తరగతుల బోధనను ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారులు పర్యవేక్షిస్తారు. 1, 2 తరగతులు బోధించే ఎస్‌జిటిలు, పాఠశాలలు విద్యాశాఖ పరిధిలోనే ఉంటాయి. ప్రాథమిక పాఠశాలకు కిలోమీటరు దూరంలో ఉన్న అంగన్‌వాడీలను దగ్గరలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో కలిపి ఫౌండేషన్‌ స్కూళ్లుగా పిలుస్తారు.

Related Posts