YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

టాటా స్టీల్ కు విశాఖ ఉక్కు

టాటా స్టీల్ కు విశాఖ ఉక్కు

ముంబై, ఆగస్టు 18, 
దేశీయ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ప్రభుత్వ యాజమాన్యంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) మరియు మేనేజింగ్ డైరెక్టర్ టివి నరేంద్రన్ వెల్లడించారు. RINL, స్టీల్ మంత్రిత్వ శాఖ కింద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో 7.3 మిలియన్ టన్నుల ప్లాంట్‌ను కొనేందుకు టాటా స్టీల్ ఆసక్తిగా ఉంది.రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వందశాతం ప్రైవేటీకరణ చేస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటించగా.. ఈ క్రమంలోనే విక్రయించే దిశగా మరో కీలక ముందడుగు పడినట్టు కనిపిస్తోంది. టాటా స్టీల్ ఆసక్తిగా ఉందని, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అమ్మకం విషయంలో క్లారిటీగా ఉన్న కేంద్రం.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఏ క్షణానైనా అమ్మేందుకు సిద్ధంగా ఉంది. ఏడాదికి 7.3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ దేశంలో ఏర్పాటైన మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో దశాబ్దాల కిందటే రాష్ట్రంలో ఉద్యమాలు చేసి సాధించుకున్న ఈ ప్లాంట్‌‌ను ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది.రాష్ట్రంలోని ఈ విశాఖ ఉక్కు నుంచి 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణకు.. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కేబినెట్ కమిటీలో చర్చ జరిగింది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది కేంద్రం. వందశాతం పెట్టుబడులను ఉపసంహరించుకోనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబర్చిన  టీవీ నరేంద్రన్.. భౌగోళికంగా దక్షిణాదిన.. తీర ప్రాంతం కావడం, నాణ్యమైన ఉక్కును ఉత్పత్తి చేస్తోండటం, 22వేల ఎకరాల్లో విస్తరించి ఉండడాన్ని ప్రధాన కారణాలుగా చెబుతుంది. వనరుల వల్ల వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు.తీరప్రాంతంలో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ వల్ల లభాలు బాగా వస్తాయని, టాటా భావిస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సమీపంలోనే గంగవరం ఓడరేవు ఉండగా.. ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడిసరుకులను తెప్పించుకోవడం కూడా ఈజీగా ఉంటుందనేది వారి అభిప్రాయం. అదే సమయంలో ఇక్కడ తయారైన స్టీల్‌ను ఎగుమతి చేయడానికీ పోర్ట్ ఉపయోగపడుతుందని టీవీ నరేంద్రన్ చెబుతున్నారు. దక్షిణ, తూర్పు ఆసియా దేశాల మార్కెట్లకు ఉక్కును రవాణా చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌తో పాటు ఒడిశాలోని నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను కూడా టేకోవర్ చేయాలని భావిస్తున్నారు టీవీ నరేంద్రన్.

Related Posts