YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మా "ఎన్నికలలో ప్రకాష్ రాజు విజయం సాధించాలని జూనియర్ ఆర్టిస్ట్ పాదయాత్ర

మా "ఎన్నికలలో ప్రకాష్ రాజు విజయం  సాధించాలని జూనియర్ ఆర్టిస్ట్ పాదయాత్ర

" మా " మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో జరుగుతున్న అధ్యక్ష కార్యవర్గ ఎన్నికల లో ప్రముఖ సినీ నటులు ప్రకాష్ రాజ్ విజయం సాధించాలని కోరుతూ సినీ  జూనియర్ ఆర్టిస్ట్ పి.రంజిత్ కుమార్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు నుంచి హైదరాబాద్ వరకూ ఈ పాదయాత్ర సాగుతోంది. సుమారు 485 కిలోమీటర్ల సాగే ఈ పాదయాత్ర ను బుధవారం కొంతమూరు గ్రామంలో  పెందుర్తి ఫౌండేషన్ అధినేత పెందుర్తి సునీల్ జెండా ఊపి ప్రాంభించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ విజయం సాధించాలని కొరుతూ పాదయాత్ర నిర్వహిస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ పల్లి రంజిత్ కుమార్  మాట్లాడుతూ " మా "  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ) లో జరుగుతున్న ఎన్నికలలో ప్రముఖ సినీ నటులు ప్రకాష్ రాజ్ మా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని కోరుతూ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారని సినీ ఇండస్ట్రీలో చెబుతూ ఉంటారని అన్నారు. ఆయన సేవా కార్యక్రమాలు ఆకర్షితుడినై  అభిమాని గా మారానని  అని అన్నారు. " మా " అధ్యక్ష ఎన్నికలలో ప్రకాష్ రాజ్ తో పాటు నరేష్, మంచు విష్ణు, హేమ, తదితరులు సినీ నటులు పోటీ చేస్తున్నారని తెలిపారు. సినీనటుడు ప్రకాష్ రాజ్   ప్రజలు ఆపదలో ఉన్నా ఆదుకొని వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను ఆదుకుంటారని తెలిపారు. అలాంటి వ్యక్తి పై  నాన్ లోకల్ అంటూ  ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. సినీ నటులకు లోకల్ నాన్ లోకల్ అంటూ ప్రాంతీయ భేదాలు ఉండవన్నారు.  అన్ని ప్రాంతాల ప్రజలు వారిని అభిమావిస్తారని పేర్కొన్నారు. వచ్చే నెలలో జరగనున్న " మా " అధ్యక్ష ఎన్నికలలో ప్రకాష్ రాజు విజయం సాధించాలని కోరుకుంటూ 485 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. ఐదు రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర అనంతరం సినీనటుడు ప్రకాష్ రాజ్ నూ కలుస్తామని అన్నారు. ఈ సందర్భంగా పెందుర్తి ఫౌండేషన్ అధినేత పెందుర్తి సునీల్ మాట్లాడుతూ రంజిత్ కుమార్ పాదయాత్ర అనుకున్నది సాధించి విజయవంతంగా కావాలని కోరుకుంటున్నాని అన్నారు. పాదయాత్ర అనంతరం ఆయురారోగ్యాలతో తిరిగి ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పండు తదితర నాయకులు పాల్గొన్నారు.

Related Posts