హైదరాబాద్
నేటికి దళితుల పట్ల దాడులు జరగడం హేయమైన చర్య అని, ఓ ప్రజా ప్రతినిధి దాడి చేయించడం ఆయన దురంహాంకారిని నిదర్శమని అన్నారు జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్దార్. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆయన అనుచరుల దాడిలో గాయపడి కూకట్ పల్లి రాందేవ్ రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు పరామర్శించారు. దాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హల్దార్ ఓ ప్రజాప్రతినిధి అయ్యుండి మహిళలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ గా పరిగణిస్తుందని, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయకపోవడం పట్ల హల్దార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణలో మానవ హక్కులు ఉన్నాయా..? దళితుల మీద దాడులు జరుగుతుంటే ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులైన వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.