YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 ఔరంగజేబు వెన్నులో వణుకు పుట్టించిన అసామాన్యుడు సర్వాయి పాపన్న. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్

 ఔరంగజేబు వెన్నులో వణుకు పుట్టించిన అసామాన్యుడు సర్వాయి పాపన్న. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్

 ఔరంగజేబు వెన్నులో వణుకు పుట్టించిన అసామాన్యుడు సర్వాయి పాపన్న
    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్
హైదరాబాద్ ఆగష్టు 18
సామాన్య కల్లుగీత కుటుంబంలో పుట్టి నాటి మొగల్ చక్రవర్తి ఔరంగజేబు వెన్నులో వణుకు పుట్టించిన అసామాన్యుడు మన సర్దార్ సర్వాయి పాపన్నఅని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మీడియా ను ఉద్దేశించి మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్   తెలుగు వాడు కావడం మనందరికీ నిజంగా గర్వకారణం. ఈరోజు ఆయనను స్మరించుకోవడం నాకెంతో సంతోషంగా ఉందన్నారు.సర్వాయి పాపన్న బడుగు, బలహీన, పేదల పాలిట ఆపద్బాంధవుడు.  సమసమాజ స్థాపన సాధన కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వీరుడు. ఔరంగజేబుకే ముచ్చెమటలు పట్టించి గోల్కొండ ఖిల్లాపై జెండాను ఎగరేసిన కొదమ సింహం.  మొగలాయి రాజ్యాన్ని హస్తగతం చేసుకుని 30 ఏళ్ల పాటు పాలించిన పోరాట యోధుడు మన సర్వాయి పాపన్న అని కొనియాడారు.• ‘‘అమ్మా! తాటిచెట్టు ఎక్కను. లొట్టి పట్టను. గోల్కొండ ఖిల్లాపై జెండా ఎగరేయడమే నా జీవిత ఆశయం’’ అని తల్లికి మాటిచ్చి అనుకున్నది సాధించిన మహా వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న సర్వాయి పాపన్నకు ఆనాడు సిద్ధాంతాలు తెలియవు. ప్రపంచ విప్లవాల అధ్యయనం అసలే లేదు. ఉన్నత రాజరిక వంశ పారంపర్యం లేదు. అతి సామాన్య కల్లుగీత కుటుంబం పాపన్నది. కానీ ఆనాటి మొఘల్ చక్రవర్తుల నిరంకుశ పాలనను, స్థానిక జమిందారులు, జాగీర్ దారులు, దేశ్ ముఖ్ లు, భూస్వాముల దోపిడిని, దౌర్జన్యాలకు విసిగిపోయి ఎదిరించడానికి అతను చేసిన సాహసం ఎనలేనిదని కొనియాడారు.ఒక్కనితో ప్రారంభమైన సర్దార్ పాపన్న పోరాటం సబ్బండ కులాల పీడిత ప్రజలను సమీకరించుకొని 12 వేల సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని.. గెరిల్లా పోరాటాలు చేస్తూ తన స్వస్థలం ఖిలాషాపూర్‌ రాజధానిగా పాలన సాగించాడు. భువనగిరి కోటను వశం చేసుకొని సుమారు రెండు దశాబ్దాలు, గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని 30 ఏళ్లపాటు జనరంజక పాలన చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఛత్రపతి శివాజీ మహరాజ్, సర్దార్ సర్వాయి పాపన్న దాదాపు సమకాలీనులే. పాపన్న కంటే శివాజీ 20 సంవత్సరాలు ముందు జన్మించారు. ఇద్దరూ మొఘల్ చక్రవర్తులను ఎదిరించి రాజ్యాలను స్వాధీనం చేసుకున్న వాళ్లే. కానీ  ఛత్రపతి శివాజీకి దేశ చరిత్రలో దక్కిన స్థానం సర్దార్ సర్వాయి పాపన్నకు దక్కలేదు. కనీస చారిత్రక ఆనవాళ్లు కూడా లేకుండా పాలకులు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం సర్దార్ సర్వాయి పాపన్నజయంతి ఉత్సవాలను నిర్వహించకపోవడం బాధాకరం. కేసీఆర్, ఆయన కుటుంబ చరిత్రే తెలంగాణ చరిత్ర గా మార్చాలని చూస్తుండటం సిగ్గుచేటు.  మజ్లీస్ నేతలకు భయపడే పాపన్న చరిత్రను కనుమరుగు చేసే కుట్ర కేసీఆర్ చేస్తుండు. ఆత్మ గౌరవం కంటే కేసీఆర్ ఇచ్చే తాయిలాలు తెలంగాణ ప్రజలకు ముఖ్యం కాదని గుర్తుంచుకోవాలి.  పాపన్న చరిత్ర ను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేసారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల సాధనకు మనమంతా ఏకం కావాల్సిన సమయం వచ్చింది. నయా మొఘల్...నయా నిజాం కేసీఆర్ పాలనలో మన తెలంగాణ బందీ అయ్యింది. కమీషన్ల పేరుతో రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుతింటోంది. జనం ఛస్తున్నా పట్టించుకోని దుర్మార్గపు పాలన తెలంగాణలో ఇంకా కొనసాగడం మన దౌర్భాగ్యం. ఈ నయా నిజాం నిరంకుశ, నియంత పాలనను అంతం చేసేందుకు ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపడుతున్న. నా గౌడ కులస్తులారా....నా యువతీ యువకులారా...నా సబ్బండ కులాల సోదరీ సోదరీమణులారా.... సర్దార్ సర్వాయి పాపన్న స్పూర్తితో  దొరల గడీలు బద్దలు కొట్టి నయా రజాకార్ల పాలనను అంతం చేద్దాం. బీజేపీతో కలిసి రండి. ‘ప్రజా సంకల్ప యాత్ర’ సాక్షిగా మన సత్తా ఏమిటో నయా నిజాం కేసీఆర్ కు చాటుదాం. అవినీతి, దోపిడీ, కుటుంబ పాలనను అంతమొందిద్దాం.  ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణ సాధించుకుందాం. పేదల శ్రేయస్సే లక్ష్యంగా నవ తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా అక్టోబర్ 24 న ప్రారంభమయ్యే ‘ప్రజా సంకల్ప యాత్ర’కు మీరంతా ఉప్పెనలా కదిలి రావాలని సంజయ్ పిలుపునిచ్చారు.

Related Posts