YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

యాప్ తో ఇంటి ముందకే సేవలు

యాప్ తో  ఇంటి ముందకే సేవలు

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నూతనంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టీ-యాప్ ఫోలియో అప్లికేషన్‌ను ఫిబ్రవరి 28న ఆవిష్కరించారు. యాప్ ద్వారా ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాలకు, మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే ఇంటి నుంచి అరచేతిలో ప్రభుత్వ సేవలు పొందవచ్చు. ఐటీ శాఖతో పాటు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ సంస్థలు సంయుక్తంగా ఈ యాప్‌ను అభివృద్ధి చేశారుదీని ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా నాణ్యమైన సేవలు అందనున్నాయి. మీ-సేవా కేంద్రాల చుట్టూ తిరగకుండా ఇంట్లో కూర్చునే ప్రభుత్వ సేవలు పొందే విధంగా ప్రభుత్వం టీ-యాప్ ఫోలియోను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మీ-సేవ కేంద్రాలలో ఉండే 150రకాల సేవలను ప్రజల చెంతకు తీసుకువచ్చింది.టెక్నాలజీతో పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం ఆ సేవలను అనునిత్యం ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నది. ఎంత పెరిగినా ప్రజలకు ఉపయోగపడకపోతే అది నిరుపయోగమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు అంటుంటారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.దీని ద్వారా ప్రభుత్వ సేవలను సులభంగా పొందవచ్చు. మీ-సేవ కేంద్రాల్లో చెల్లించనున్న నగదు కన్నా తక్కువ ఖర్చుతో సేవలను అందించడమే ఈ యాప్ ప్రత్యేకం.విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అవసరమైనప్పుడు యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదే కాకుండా అవివాహితులకు స్థానిక గుర్తింపు పత్రం, రైతులకు ఫహాణీ, ఆర్‌ఓఆర్ వన్‌బీ నకలు కోసం దరఖాస్తు చేయవచ్చు. అదే కాకుండా పుణ్యక్షేత్రాలకు వెళ్లే ముందు దైవదర్శనంతో పాటు అక్కడే బస చేసేందుకు గదులను బుక్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా తక్కువ ఖర్చుతో కావాల్సిన పత్రాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. తిరిగి వచ్చిన ట్రాన్జక్షన్ నంబర్‌తో అందుబాటులోని మీ-సేవ కేంద్రం ద్వారా కావాల్సిన ధ్రువపత్రం తీసుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే పనులన్ని టీ-మాస్ ఫోలియో ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చు. వీటితో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు, వ్యవశాయ శాఖ, రవాణాశాఖ, ఉద్యోగ, కార్మికుల కోసం ఈపీఎఫ్ సేవ లు, ఇంటర్మీడియట్, ఇతర సేవలు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. అవే కాకుండా నగదు చెల్లింపులను ఎవరికైనా చేసుకోవచ్చు. మీ-సేవలో అందే అన్ని రకాల సేవలను సైతం టీ-యాప్ ద్వారా పొందవచ్చు. విద్యార్థుల కోసం పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల ఫీజులను ఈ యాప్ ద్వారా చెల్లించవచ్చు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ఉపకార వేతనాలు, విదేశీ విద్యకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. యాప్ ద్వారా పలు పరీక్షల ఫలితాలు తెలుసుకోవచ్చు. కుల, ఆదాయ, నివాస, జనన, మరణ పత్రాలను పొందవచ్చు. టీ-యాప్ ద్వారా దరఖాస్తులు చేసుకుని దగ్గరలో ఉన్న మీ-సేవా కేంద్రాలలో ధ్రువపత్రాలను తీసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. ఈ యాప్‌తో బస్సు, రైలు టికెట్లతో పాటు కావాల్సిన ప్రదేశాల్లో హోటల్ బుకింగ్ చేసుకోవచ్చు. వాటితో పాటుగా క్రికెట్ మ్యాచ్ పోటీలకు కావాల్సిన టికెట్లను బుకింగ్ చేసుకునే సదుపాయం ఉంది. వీటితో పాటు అన్ని రకాల బీమా సంస్థల చెల్లింపులు చేసుకోవచ్చు. టీ-వ్యాలెట్ ద్వారా నగదు లావాదేవీలు జరుపుకోవచ్చు. ఆలయాల్లో పూజలు, అభిషేకాలకు చెందిన టికెట్లను పొందవచ్చు.

Related Posts