YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మీడియా బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాలి   సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ

మీడియా బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాలి   సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ

మీడియా బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాలి
  సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ
న్యూఢిల్లీ ఆగష్టు 18
కొత్త జ‌డ్జీల నియామ‌కంపై మీడియాలో వార్త‌లు రావ‌డంపై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అలాంటి నియామ‌కాల‌పై రిపోర్ట్ చేసేట‌ప్పుడు మీడియా బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న అన్నారు. కొత్త జ‌డ్జీల నియామ‌కంపై సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు ఇవీ అంటూ మీడియాలో వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సిఫార్సుల ప్రకారం 2027లో దేశానికి తొలి మ‌హిళా సీజేఐ రాబోతున్నార‌ని, ఆమె క‌ర్ణాట‌క జ‌డ్జిగా ఉన్న నాగ‌రత్నే కావ‌చ్చ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇలాంటి నియామ‌కాల‌పై అధికారిక ప్ర‌క‌ట‌న కంటే ముందే వార్త‌లు రావ‌డం ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంద‌ని ఎన్వీ ర‌మ‌ణ అన్నారు.జ‌డ్జీల నియామ‌క ప్ర‌క్రియ‌కు ఓ ప‌విత్ర‌త‌, హుందాత‌నం ఉంటాయి. మీడియా స్నేహితులు ఈ ప్ర‌క్రియ ప‌విత్ర‌త‌ను అర్థం చేసుకోవాలి, గుర్తించాలి అని ర‌మ‌ణ అన్నారు. ఇలాంటి బాధ్య‌తా ర‌హిత రిపోర్ట్‌ల కార‌ణంగా అర్హులైన అభ్య‌ర్థుల‌కు ప‌ద‌వులు ద‌క్క‌ని ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి. వీటిపై నేను చాలా అసంతృప్తిగా ఉన్నాను. ఇలాంటి తీవ్ర‌మైన అంశంపై సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు, మీడియా హౌజ్‌లు కాస్త ప‌రిణ‌తితో, బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాలి అని సీజేఐ స్ప‌ష్టం చేశారు.

Related Posts