YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విద్యార్థులకు జగన్న విద్య కానుక కిట్లు పంపిణీ

విద్యార్థులకు జగన్న విద్య కానుక కిట్లు పంపిణీ

విద్యార్థులకు జగన్న విద్య కానుక కిట్లు పంపిణీ
కౌతాళం
ప్రతి విద్యార్థి చదువు ఉంటేనే ప్రయోజకులు అవుతారని అందరికీ చదువు అందలనే ఉద్దేశ్యం తోనే ముఖ్యమంత్రి పనిచేస్తున్నరాని ఉన్నత పాఠశాల వడ్డే రాముడు పేర్కొన్నారు.బుదవారం మండల కేంద్రంలో  ప్రభుత్వ పాఠశాల ఛైర్మన్ వడ్డే రాముడు అధ్యక్షతన జగనన్న విద్యా కానుక కార్యక్రమం నిర్వహించారు. కౌతాళం మండల కేంద్రం గ్రామంలోని  ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు జగన్న విద్యా కానుక కిట్లను ఉన్నత పాఠశాల  చైర్మన్ వడ్డే రాముడు,సర్పంచ్ పాల్ దినకర్, ఉప సర్పంచ్ తిక్కయ్య అందజేశారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ.. పేద విద్యార్థులు ఎవ్వరు చదువుకోవడానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యాభివద్ధికి ఎంతో కృషి చేస్తోందని, ప్రతి సంవత్సరం రెండు జతల బట్టలు,షూస్, పుస్తకాలు పంపిణి చేస్తున్నారు. అదేవిధంగా పిల్లలకు బళ్ళో పెట్టె మధ్యాహ్న భోజనంలో కూడా మార్పులు చేసి మంచి రుచికరమైన భోజనం పెడుతున్నారని, విద్యార్థులకు అమ్మ ఓడి రూపంలో సంవత్సరనికి పదిహేను వేల రూపాయలు అందజేస్తున్నారు. ఏ ప్రభుత్వ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ చేయడంతో పాటుగా చదువు కోవాలని ఉన్న  చదివించే ఆర్థిక స్తోమత లేక చాలామంది చదువు మానేసి కూలీ పనులకు వెళ్తున్నరని, అటువంటి వాళ్ళు చదువు కునేందుకు వైసిపి ప్రభుత్వం విద్యాభివద్ధికి ఎంతో కృషి చేస్తోందని, ప్రవేట్ స్కూలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో  అన్ని వసతులు మౌలిక సదుపాయాలు కల్పించడంతో విద్య పట్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధకు నిదర్శనమని, ప్రతి విద్యార్థీ విద్యా కానుకను సద్వినియోగం చేసుకోవాలని,వడ్డే రాముడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అవతారం, సర్పంచ్ పాల్ దినకర్ ,తిక్కయ్య, బుజ్జి స్వామి, మహానంది  ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts