YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 బిటెక్ విద్యార్థిని రమ్య కు శ్రీసాయి గ్లోబల్ కంప్యూటర్స్ విద్యార్థుల ఘన నివాళి

 బిటెక్ విద్యార్థిని రమ్య కు శ్రీసాయి గ్లోబల్ కంప్యూటర్స్ విద్యార్థుల ఘన నివాళి

 బిటెక్ విద్యార్థిని రమ్య కు శ్రీసాయి గ్లోబల్ కంప్యూటర్స్ విద్యార్థుల ఘన నివాళి
డోన్
బిటెక్ విద్యార్థిని రమ్య కు శ్రీ సాయి గ్లోబల్ కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ అకడమి విద్యార్థులందరూ నివాళులు అర్పించారు, స్థానిక శ్రీసాయి గ్లోబల్ కంప్యూటర్స్ మరియు ఎడ్యుకేషన్ అకాడమి లో బీటెక్ విద్యార్థిని రమ్యకు  విద్యార్థులు కోవతులతో నివాళులు అర్పించారు,పట్టణంలో శ్రీ సాయి గ్లోబల్ కంప్యూటర్ అండ్ అదుకేషల్ అకాడమీ అధినేత ఇమిడి లక్ష్మణ్ సాయి మాట్లాడుతూ. దేశమంతటా స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థిని రమ్యను పట్టపగలే నడిరోడ్డుపై జనమంతా చూస్తుండగానే శశి అనే యువకుడు ఆ అమ్మాయి పై విచక్షణారహితంగా దాడి చేసి కత్తితో పొడిచి హతమార్చడం చాలా బాధాకరం. అసలు ఈ రాష్ట్రంలో మహిళలకు సరైన రక్షణ అనేది ఉందా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున పట్టపగలే నడిరోడ్డుపై దళిత విద్యార్థిని హత్యకు గురికావడం చాలా బాధాకరం,ఇదేవిధంగా కర్నూలు జిల్లా కర్నూల్ లోని ప్రీతిభాయ్ , గోనెగండ్ల గ్రామానికి చెందిన హజీరా , వెల్దుర్తి లో మనసా, ధర్మవరం లో స్నేహాలత  ఇంకా ఎంతో మంది అమ్మాయిలు  అత్యాచారానికి గురై సంవత్సరాలు గడుస్తున్నా వారికి ఎలాంటి న్యాయం జరగకపోవడం సిగ్గుచేటు అని అన్నారు,అసలు ఆడవాళ్లపై అత్యంత దారుణంగా ఇలాంటి అత్యాచారాలు జరుగుతూ ఉంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా? అన్న అనుమానం వస్తుంది. అందుకే మహిళలకు రక్షణ కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు, అలాగే ఇలాంటి నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు,అసలు ఇలాంటి నేరాలు చేసే వారికి ఎటువంటి శిక్షలు సరిపోవు వారికి ఉరిశిక్షే సరైన మార్గం అనీ చనిపోయిన విద్యార్థిని రమ్య కు ఇన్స్టిట్యూట్ విద్యార్థులు  సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ వెంకటేష్, ఉపాధ్యక్షుడు మోహన్ గౌడ్, అర్జున్,విద్యార్థులు పాల్గొన్నారు..

Related Posts