సునందా మృతి కేసులో ఎంపీ శశి థరూర్‌కు ఢిల్లీ హైకోర్టు క్లీన్ చిట్
న్యూఢిల్లీ ఆగష్టు 18
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఢిల్లీ హైకోర్టు క్లెన్ చిట్ ఇచ్చింది . భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఎంపీ శశిథరూర్‌పై ఉన్న ఆరోపణలను కోర్టు కొట్టిపారేసింది. ఢిల్లీ హైకోర్టు స్పెషల్ జడ్జి గీతాంజలి గోయల్ ఈ తీర్పును వెలువరించారు. 7.5 ఏళ్ల పాటు తనను దారుణంగా వేధించినట్లు చెప్పారు.సునందా పుష్కర్ 2014, జనవరి ఏడో తేదిన అనుమానాస్పద రీతిలో మరణించారు. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో విచారణ చేపట్టారు. సెక్షన్ 302 మర్డర్ కేసు కూడా ఎంపీఐ పెట్టారు. శశిథరూర్‌పై 306 (ఆత్మహత్యాయత్నం), సెక్షన్ 498ఏ (భర్త క్రూరత్వం) సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసి విచారించారు. ఈ కేసులో శశిథరూర్ తరపున సీనియర్ అడ్వకేట్ వికాశ్ పాహ్వా వాదించారు.సునందను మానసికంగా కానీ శారీరకంగా కానీ తన క్లయింట్ వేధించలేదని న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఫోరెన్సిక్, మెడికల్ నివేదికల ప్రకారం సునంది హత్య లేక సూసైడ్ కూడా కాదని చెబుతున్నట్లు కోర్టులో వాదించారు. ప్రమాదవశాత్తు సునంద మరణించి ఉంటుందని కొన్ని నివేదికలను కోర్టుకు సమర్పించారు. నాలుగేళ్ల విచారణ తర్వాత ఢిల్లీ పోలీసులు ఎటువంటి ఆధారాలను సేకరించలేకపోయినట్లు పాహ్వా కోర్టుకు చెప్పారు.కాగా కోర్టు తీర్పు తర్వాత శశిథరూర్ రియాక్ట్ అయ్యారు.7.5 ఏళ్ల పాటు తనను దారుణంగా వేధించినట్లు చెప్పారు.