YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరు-మల్లవరం ఆరు లైన్ల  రహదారి పూర్తికి   సహకరించండి  

చిత్తూరు-మల్లవరం ఆరు లైన్ల  రహదారి పూర్తికి   సహకరించండి  

చిత్తూరు-మల్లవరం ఆరు లైన్ల  రహదారి పూర్తికి   సహకరించండి  
– జిల్లా కలెక్టర్
తిరుపతి, ,ఆగష్టు 18
చిత్తూరు (కుక్కలపల్లి) – సి. మల్లవరంఆరు లైన్ల 140 నెంబరు  జాతీయ రహదారి పనులు  త్వరగా పూర్తి చేయడానికి సహకరించాలని, పనులకు ఆటంకం లేకుండా  రైతుల భూములు, ,ఇళ్లస్థలాల సమస్యలు రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.రాజాబాబు అన్నారు. బుధవారం  ఉదయం నుండి మధ్యాహ్నం వరకు  ఆరు  లైన్ల రహదారిలో కోర్టులను ఆశ్రయించిన రైతులతో , గృహాలు కోల్పోతున్న వారితో జిల్లా కలెక్టర్ , తిరుపతి ఆర్. డి. ఓ.  కనకనరసా రెడ్డి  , సంబంధిత తహసీల్దార్ల సమక్షంలో సమస్యలపై,  పరిహారంపై  పెండింగ్ లో వున్న ఆయా ప్రదేశాలలో  చర్చించారు.  
        జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పరిహారం విషయంలో ప్రభుత్వ పరంగా మీకు న్యాయం జరిగేలా చూస్తానని,  వ్రాత పూర్వకంగా సమస్యలు తెలపాలని, పరిష్కరించడానికి సిద్దంగా వున్నామని  అన్నారు.   ఇప్పటికే రూ.1800 కోట్లతో నిర్మిస్తున్న జాతీయ రహదారి,  90% పైగా పూర్తి అయిన రహదారిలో , చిన్న సమస్యలతో 61 కి.మీ.లలో కేవలం  10 కి.మీ లు రహదారి నిర్మాణం ఆలస్యం  కావడం ప్రజా ప్రయోజనాల  దృష్ట్యా భావ్యంకాదని అన్నారు.  కోవిడ్ కారణంతో ఇప్పటికే చాలా ఆలస్యం కావడం, కోర్టు కేసులు వల్ల పనులు ఆలస్యమైందని తెలిపారు.  చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి, బొడింబాయి వద్ద కోర్టులో కేసులు వేసి వున్నరైతులతో మాట్లాడటం,  కృష్ణాపురం  వద్ద ఇళ్ళు కట్టుకున్నట్టుకుంటున్న వారి కోరిన మేరకు  విద్యుత్ లైన్లు ఏర్పాటు , పనపాకం వద్ద రైస్ మిల్లు వారి  పరిహారం విషయం , సబ్ స్టేషన్ మార్పు, ఇరుగుశెట్టి వారిపల్లి గృహాల కోసం ఆలస్యంలేకుండా కల్ రోడ్ పల్లి వద్ద  ఇంటి స్థలాల విషయం,  పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చి జాతీయ రహదారికి సహకరించాలని కోరారు. గతంలో నెలలో  జిల్లా కలెక్టర్ ఎం.హారినారాయణన్  రైతులు కోరిన మేరకు జాతీయ రహదారికి ఆనుకొని వున్న రవణప్పగారిపల్లి  వద్ద స్వర్ణముఖి కాలువ   ఫ్లడ్ వాల్ నిర్మాణం పరిశీలించారు. రైతుల భూములు వర్షాలవల్ల భూమి  కోతలకు గురికాకుండా  జాగ్రత్తతో , న్యాణ్యతతో  ఫ్లడ్ వాల్ జరగాలని ఆదేశించారు.  పాకాల మండలం సామిరెడ్డి పల్లివద్ద ఇంటి విషయం కోర్టు కేసు వేసిన  వ్యక్తులతో  సహరించాలని ప్రాధాన్యత గుర్తించాలని సూచించారు.
      జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యటన లో చంద్రగిరి తహసిల్దారు వెంకటేశ్వర్లు, పాకాల తహసిల్దారు భాగ్యలక్ష్మి , ఆర్. ఐ. లు మోహన్ రెడ్డి, జగన్, కె .ఎన్. ఆర్. కంస్ట్రక్షన్  ప్రతినిధులు వినోద్, వెంకటేష్ అధికారులు వున్నారు.

Related Posts