జగనన్న ఇళ్ల శంకుస్థాపన, జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రసన్న
నెల్లూరు
నెల్లూరు జిల్లా , కోవూరు పంచాయతీ గాంధీ సంగం గిరిజన కాలనీలో జగనన్న కాలనీ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం ,కోవూరు లోని జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల లో జగన్న విద్యకనుక కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో రూ.4.80 లక్షలతో పిల్లలకు నూతనంగా నిర్మించిన మంచినీటి వసతి మరియు సైకిల్ స్టాండ్ ను బుధవారం లాంఛనంగాప్రారంభించారు.పాఠశాల లో పదవ తరగతిలో లో 10కి 10 మార్కులు సాధించిన 4గురు విద్యార్థినులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున 4గురికి రూ.80 వేల ఆర్థిక సహాయాన్ని స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రకటించారు.కోవూరులో నూతనంగా నిర్మితమైన రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రజాసంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో
జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి , జిల్లా డి ఎ ఎ బి ఛైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి , జిల్లా డిసిఎంఎస్ ఛైర్మన్ వీరి చలపతిరావు , జొన్నవాడ దేవస్థానం మాజీ ఛైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి , కోవూరు సర్పంచ్ విజయమ్మ , ఉపసర్పంచ్ మైన్ ఉద్దీన్ , హౌసింగ్ డివిజనల్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, మండల తాసిల్దార్, మండల అభివృద్ధి అధికారి తదితరులు పాల్గొన్నారు.