YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశ, రాష్ట్రాల చట్టసభల్లో సమావేశాలకు తరచూ అంతరాయాలు ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి

దేశ, రాష్ట్రాల చట్టసభల్లో సమావేశాలకు తరచూ అంతరాయాలు ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి

దేశ, రాష్ట్రాల చట్టసభల్లో సమావేశాలకు తరచూ అంతరాయాలు
ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి
 బెంగళూరు
ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాల్సిన చట్టసభల్లో తరచూ సమావేశాలకు తరచూ కలుగుతున్న అంతరాయాల పట్ల, ప్రజాస్వామ్య వ్యవస్థ నవ్వులపాలు అవుతుండడం పట్ల ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. భారత పార్లమెంట్, మరియు రాష్ట్రాల శాసన సభల్లో జరిగే సమావేశాలు అర్ధవంతంగా ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగానూ, యు వతకు ఆదర్శంగా ఉండాలన్న ఆయన, ప్రజాప్రతినిధులు ఆదర్శనీయులుగా ఉండాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
బుధవారం బెంగళూరులో ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్కేసీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారక అవార్డు ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల రాజ్యసభలో సమావేశాలకు తరచూ అంతరాయాలు కలగడం, సభ సజావుగా ముందుకు సాగకపోవడం తనకు బాధను కలిగించిందని, అంతే కాకుండా ఇటీవల పలు రాష్ట్రాల శాసన సభల్లో జరిగిన సంఘటనలు, చోటు చేసుకుంటున్న పరిణామాలు తనకు ఆవేదన కలిగించాయని తెలిపారు. పార్లమెంట్ లో ఇటీవల జరిగిన సంఘటనలు దురదృష్టకరమన్న ఉపరాష్ట్రపతి, కొంత మంది సభ్యులు ప్రవర్తించిన తీరు విచారకరమన్నారు. పార్లమెంట్ స్థాయిని దిగజార్చే విధంగా కొందరు సభ్యులు ప్రవర్తించారని, కఠిన చర్యలు తీసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారని, ఇదే తనకు దుఃఖాన్ని కలిగించిందని తెలిపారు.
కొందరు పార్లమెంట్ సభ్యుల ప్రవర్తన సభాస్థాయికి తగిన విధంగా లేవన్న ఉపరాష్ట్రపతి, చట్టసభలు చర్చించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమేనని, అంతరాయాలు కలిగించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును గౌరవించాలన్న ఆయన, అసమ్మతిని వ్యక్తం చేయడంలో తప్పు లేదని, నిశితంగా విమర్శించవచ్చని అదే సమయంలో ఎవరి మీద తమ అభిప్రాయాలను బలవంతంగా రుద్దకూడదని స్పష్టం చేశారు. వివిధ స్థాయిల్లో పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు అర్థవంతమైన చర్చల ద్వారా సమావేశాలను ప్రజలకు మేలు కలిగే విధంగా వినియోగించుకోవాలని సూచించారు. భవిష్యత్ లో ఈ పరిస్థితి మారాలని ఆకాంక్షించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను, ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలను మరింత సుస్థిరం చేసేందుకు  మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి మహనీయుల స్ఫూర్తితో నూతన ఆవిష్కరణల దిశగా యువత ముందుకు కదలాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా వారిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని  ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. వాతావరణ మార్పులనుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు అంతర్జాతీయంగా తీసుకునే చర్యల్లో రానున్న కొన్ని సంవత్సరాలు అత్యంత కీలకమని, దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసే విషయంలో కర్బన ఉద్గారాలను గణనీయమైన స్థాయిలో తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. నూతన ఆవిష్కరణలతోనే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని నొక్కిచెప్పారు.

Related Posts