YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జూన్ 2 తర్వాత కొత్త రేషన్ కార్డులు

జూన్ 2 తర్వాత కొత్త రేషన్ కార్డులు

జూన్‌ 2 నుంచి కొత్త  రేషన్‌కార్డుల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కార్డులు పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. జిల్లాలో కొత్త రేషన్‌కార్డుల కోసం లబ్ధిదారులు ఏళ్లగా ఎదురుచూస్తున్నారు. ఏటా నిర్వహించే జన్మభూమి సభల్లోనే కార్డులు కొంతవరకూ పంపిణీ అవుతున్నాయి. తర్వాత ఆశించిన స్థాయిలో పంపిణీ ఉండటం లేదు. దరఖాస్తులు చేసుకుని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న వారు వేలాది మంది ఉన్నారు. ప్రతి వారం మండలాల్లో జరిగే గ్రీవెన్స్‌సెల్‌, కలెక్టరేట్‌లో నిర్వహించే ‘మీకోసం’ వినతుల స్వీకరణ కార్యక్రమానికి అధిక సంఖ్యలో దరఖాస్తులు రేషన్‌కార్డుల కోసమే వస్తున్నాయి. మరోవైపు గడిచిన రెండు జన్మభూమి సభల్లోనూ పంపిణీ చేసిన రేషన్‌కార్డులు తప్పుల తడకగా ఉన్నాయి.జిల్లాలో ప్రస్తుతం తెలుపు కార్డులు 6,15,297, ఏఏవై 85,600, అన్నపూర్ణ 898, గులాబీరంగు కార్డులు 43,937 ఉన్నాయి. కొత్త రేషన్‌కార్డుల కోసం జిల్లాలో 22 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. గత జనవరిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో 6,984 కార్డులను పంపిణీ చేశారు. ఇంకా 15 వేల వరకు దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. జూన్‌ 2 తర్వాత వీరందరికీ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో పల్స్‌ సర్వేలో నమోదు కానివారికి రేషన్‌కార్డులివ్వలేదు. ఈసారీ అదే పద్ధతిని అవలంబిస్తారా? లేక పల్స్‌సర్వే నుంచి మినహాయింపు ఇస్తారా? అన్నది చూడాల్సి ఉంది. ఈ నెల 8, 9వ తేదీల్లో కలెక్టర్ల సదస్సు అమరావతిలో జరగనుంది. దీని తర్వాత కొత్త పింఛన్లు, రేషన్‌కార్డుల పంపిణీపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాధికార మిత్ర, జన్మభూమి కమిటీ, పంచాయతీలు సూచించిన జాబితా నుంచి లబ్ధిదారుల ఎంపిక జరిగే అవకాశం ఉంది. 

Related Posts