YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బండి సంజయ్ బండారం బయటపెడతా

బండి సంజయ్ బండారం బయటపెడతా

హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బండరాం బయటపెడుతాననని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ నుండి మాకు వందలాది కాల్స్ వస్తున్నాయి బండి సంజయ్ మీద. బండి సంజయ్ ని ఎంపీ పదవి నుండి దింపే వరకు ఉరుకోను. పూర్తి ఆధారాలతో బండి సంజయ్ పై మీడియా సమావేశం పెడుతా. నేను భయపడే వ్యక్తి ని కాదు...బయపడితే రాజకీయాల్లో ఉండలేను. దళితుల పై దాడి చెసా అంటున్నారూ నేను ఇంట్లో  లేను సిసి టీవీ ఫుటేజ్ చూడండి. బండి సంజయ్ నువ్ ఇఫ్లూఎన్స్ ఉపయోగించిన నేను జైల్లో ఉండి కూడా ని గురించి మాట్లాడుతా. నువ్వు ఒక చెంపను కొడితే నెను రెండు చెంపలు కొట్టే వాణ్ణి.  నా మీద  ఎన్ని కేసులు పెట్టిన బయపడను. నాపై పెట్టినవి అన్ని ఫాల్స్ కేసులు. కేంద్ర ప్రభుత్వం కు భయపడి పోలీసులు ఏం చేసినా నేను జైలు కు పొవడానికి సిద్ధం. బండి సంజయ్ చిప్ ట్రిక్స్ మానుకోవాలని అన్నారు.
దాడి సమయంలో నేను ఇంట్లో ఉన్నా అని రుజువు చేయండి. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం. నా ఇంటి పై దాడి చేసినప్పుడు నేను ఇంట్లో లేను. పొద్దున జైలు కు పోయి రాత్రి వస్తా భయపడను. నా కొడుకు ముంబాయ్ లో ఉంటె ఏ2 పెట్టారు. నాకు కులం ఫీలింగ్ లేదు..నేను దళితులకు ఎన్నో  కార్యక్రమలు చేసానని అన్నారు.
బండి సంజయ్ వి చేతగాని పనులు. టీడీపీ కష్టకాలం లో ఉన్నప్పుడు నెను పనిచేశాను. మల్కాజిగిరి టిక్కెట్ ఇస్తా అని చెప్పి చంద్రబాబు  ఇవ్వలేదు. మా ముఖ్యమంత్రి కేసీఆర్  భ్రహ్మండంగా అభివృద్ధి చేస్తున్నారు. జగన్ జెల్లో 16 నెలలు ఉన్నారు. న్యాయం కోసం నేను 16 ఏళ్ళు అయిన జెల్లో ఉండటానికి సిద్దం. బండి సంజయ్  ఏఎస్  రావు నగర్ లో కూడా కీప్ ఉంది అంటా. అన్ని బయటపెడుతా.  బండి సంజయ్ తో నేను ఎలాంటి చర్చ కు అయినా సిద్ధం. రా ఎక్కడ కు వస్తావో అని సవాల్ విసిరారు.

Related Posts