ఖనిలో వైఎస్సార్ టిపి జెండా పండుగ
పెద్దపల్లి ఆగస్ట్ 19
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ జిమ్మీ బాబు నేతృత్వంలో గురువారం రామగుండం కార్పొరేషన్ గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో రాజన్న యాధి లో జెండా పండుగ నిర్వహించారు. అలాగే స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జిమ్మీబాబు మాట్లాడుతూ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో 22 వేల మంది నిరుపేదలకు రాజశేఖర్ రెడ్డి ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం దొరల పాలన, గడీల పాలన కొనసాగుతుందని, అంబేద్కర్ సూచించిన సమాన హక్కు సమానత్వం సాధించాలంటే షర్మిలమ్మ నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, బడుగు బలహీన వర్గాలకు సమాన అభివృద్ధి, సమానత్వపు హక్కు కల్పించేందుకు వైఎస్ఆర్ అభిమానులు ప్రజలు షర్మిలమ్మ నాయకత్వంలో లిసిరావాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓఎల్ రెడ్డి, బూడిద బానేష్, చిప్పకుర్తి రాజు, శ్యాంసన్, మహేందర్, వెంకట్, సలీం, ఇమ్రాన్, రవి, చరణ్, చిప్పకుర్తి శోభ శంకర్, బాబు, బన్ను, విజయ్, రాకేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.