ఐటీబీపీ కామాండోలలో శ్రీకాకుళం వాసి
శ్రీకాకుళం
తాలిబన్ల స్వాధీనంతో అట్టుడికిపోతున్న ఆఫ్గనిస్తాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో భారత టిబెటన్ సరిహద్దు భద్రతా దళం కమాండోలు కీలకపాత్ర పోషించింది.ఆ దళంలో శ్రీకాకుళం జిల్లా వాసి కూడా ఉన్నారు.మందస మండలం చిన్నలింబుగాం గ్రామానికి చెందిన పులారి రాజశేఖర్ ఆఫ్గన్లో భారత రాయబార కార్యాలయంలో ఉన్నవారిని స్వదేశానికి తీసుకొచ్చే మిషన్లో చురుగ్గా వ్యవహరించారు. ప్రత్యేక విమానంలో వీరిని దేశానికి తీసుకురాగా.. రాజశేఖర్ వారి రక్షణ విధులు నిర్వర్తించారు.ఆఫ్ఘనిస్తాన్లోని భారత రాయబార కార్యాలయంలో ఐటిబిపి కమాడో గా పనిచేస్తున్న పులారి రాజశేఖర్ ... శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం ఉద్దానం ప్రాంతంలోని అంబుగం గ్రామ శివారు లింబుగాం అనే గ్రామానికి చెందిన వ్యక్తి.ఆఫ్ఘనిస్తాన్లోని భారత రాయబార కార్యాలయంలో ఐటిబిపీ కమాండర్గా పనిచేస్తున్నాడు.తాలిబన్ల అరాచకాలు పరాకాష్టకు చేరడంతో స్వగ్రామానికి వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కోంటున్న క్రమంలో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ఇబ్బందులు ఎదురవ్వకుండా సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని ఆకాక్షిస్తున్నారు.