YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 మోడీకి గుడి...పీఎంవో నిరభ్యంతరం

 మోడీకి గుడి...పీఎంవో నిరభ్యంతరం

 మోడీకి గుడి...పీఎంవో నిరభ్యంతరం
పూణె, ఆగస్టు 19, 
రాజకీయ నాయకులకు, సినీ సెలబ్రిటీలకు దేవాలయాలు కట్టించడం ఇటీవల ఓ ట్రెండ్‌లా మారుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలోని పుణేలో బీజేపీ కార్యకర్త ఒకరు ప్రధాని నరేంద్రమోదీకి గుడిని నిర్మించి.. అందులో మోడీ విగ్రహాన్ని ప్రతిష్టాంచారు. పుణెకు చెందిన 37 ఏళ్ల మయూర్‌ ముండే అనే కార్యకర్త.. మోడీకి విరాభిమాని. ఈ క్రమంలోనే మోడీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ ఏకంగా రూ. 1,60,000 ఖర్చుతో దేవాలయాన్ని నిర్మించాడు. ఇందు కోసం మయూర్‌ జైపూర్‌ మార్బల్‌ను ఉపయోగించాడు. మోడీకి ఆలయాన్ని నిర్మించడంపై మయూర్‌ మాట్లాడుతూ.. ‘ఆయోధ్యలో రాముడికి దేవాలయాన్ని నిర్మించిన వ్యక్తికి ఓ దేవాలయం ఉండాలనేది నా భావన. అందుకోసమే నేనున్న ప్రదేశంలో మోదీకి ఆలయాన్ని నిర్మించాను’అని చెప్పుకొచ్చాడు.అయితే తన అభిమాన్ని చాటుకునే క్రమంలో మయూర్‌ ఆలయాన్ని నిర్మించాడు బాగానే ఉంది. కానీ ఆ ఆలయంలో మోదీ విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించారు. ఈ పని చేసింది ప్రతిపక్షాలో, మోడీ అంటే గిట్టని వారో అనుకుంటే పొరపాటే. బీజేపీ అధిష్టానం మేరకే ఈ నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు. మోదీ ఆలయానికి సంబంధించిన వార్త మీడియాలో రావడంతో ఈ విషయం ప్రధాన మంత్రి కార్యాలయం దృష్టికి వెళ్లింది. అధికారుల సూచన మేరకు బుధవారం రాత్రి విగ్రహాన్ని తొలగించారు. దీంతో గురువారం అటుగా వెళ్లిన వారు నరేంద్ర మోదీ విగ్రహం తొలగించడాన్ని గుర్తించారు. తొలగించిన విగ్రహాన్ని అక్కడే నివాసం ఉంటున్న బీజేపీ కౌన్సిలర్‌ ఇంటికి తరలించారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది మొదట్లో పుణేలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ విగ్రహ అంశం ఎన్నికల సమయంలో చర్చకు దారి తీస్తుందన్న కారణంతోనే బీజేపీ హైకమాండ్‌ విగ్రహాన్ని తొలతించాలని ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.
విగ్రహం తొలగింపుపై నిరాశ వ్యక్తం చేసిన ఎన్‌సీపీ..
ఇదిలా ఉంటే మోదీ విగ్రహం తొలగింపుపై ఎన్‌సీపీ పార్టీ నాయకులు తమదైన శైలిలో చలోక్తులు విసిరారు. మోడీ విగ్రహాన్ని తొలగించడంపై తీవ్ర నిరాశకు గురయ్యామని ఎన్‌సీపీ అధ్యక్షులు ప్రశాంత్‌ జగ్‌పత్‌ మాట్లాడుతూ.. ‘రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, ఆహార పదార్థాల ధరలను తగ్గించమని మోదీ విగ్రహానికి వేడుకుందామని అనుకున్నాం. కానీ విగ్రహాన్ని తొలగించడంతో తీవ్రంగా నిరాశ పడ్డాం. అంతేకాకుండా పెరుగుతోన్న నిరుద్యోగాన్ని కట్టడి చేయమని పూజలు చేద్దామనుకున్నాం’ అంటూ ఛలోక్తులు విసిరారు.

Related Posts